ఆగస్ట్ 25 నుంచి జీ తెలుగు సీరియల్స్ ఇక నుంచి ప్రతిరోజూ.. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, తప్పక చూడండి!
హైదరాబాద్, 22 ఆగస్ట్ 2024: తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ముందుండే జీ తెలుగు మరో సర్ప్రైజ్తో వచ్చేస్తోంది. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్ని ఇక నుంచి ఆదివారం కూడా అందించేందుకు సిద్ధమైంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ ఆగస్ట్ 25 నుంచి ఆదివారం కూడా ప్రసారం అవుతాయి. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, మా అన్నయ్య, నిండు నూరెళ్ళ సావాసం, మేఘసందేశం, పడమటి సంధ్యారాగం, త్రినయని సీరియల్స్ ఇకనుంచి ఆదివారం కూడా తమ అభిమానులను అలరిస్తాయి
చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సాయంత్రం 6 గంటలకు, మా అన్నయ్య 6:30 గంటలకు, నిండు నూరేళ్ళ సావాసం రాత్రి 7 గంటలకు, మేఘసందేశం 7:30 గంటలకు, పడమటి సంధ్యారాగం 8 గంటలకు, త్రినయని 8:30 గంటలకు ప్రసారం కానున్నాయి. ఈ నాన్ స్టాప్ సీరియల్ ఎంటర్టైన్మెంట్ ఈ వారం నుంచే ప్రారంభమవుతోంది. అశేష ప్రేక్షకాభిమానం పొందుతున్న ఈ ఆరు సీరియల్స్ ఇక నుంచి ప్రతిరోజూ ప్రేక్షకులను అలరించనున్నాయి. మధ్యాహ్నం సీరియల్స్ మాత్రం యథాతథంగా సోమవారం నుంచి శనివారం వరకు వాటి వాటి సమయాల్లో ప్రసారమై ప్రేక్షకులను అలరిస్తాయి.
ఈ నాన్ స్టాప్ సీరియల్ ట్రీట్ తో పాటు ఈ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బ్లాక్ బస్టర్ హిట్ పిండం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ను కూడా అందిస్తోంది జీ తెలుగు. థియేటర్స్ లో విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఆకట్టుకునే కథ, కథనం, అద్భుతమైన తారాగణంతో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఈ ఆదివారం నుంచి వారం వారం నాన్స్టాప్ సీరియల్స్తో పాటు సరికొత్త సినిమాలను ఆస్వాదించేందుకు మీరూ సిద్ధంకండి!
అదరగొడుతున్న జీ తెలుగు సీరియల్స్ ఇకనుంచి ఆదివారం కూడా.. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, తప్పక చూడండి!