జీ తెలుగు వినాయక చవితి స్పెషల్ ‘RRR గణేశా‘.. ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు!
హైదరాబాద్, 05 సెప్టెంబర్ 2024: ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోలతో నిరంతం తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచే చానల్ జీ తెలుగు. పండుగల వేళ రెట్టింపు వినోదంతో అలరించే జీ తెలుగు ఈ వినాయక చవితికి మరో సరికొత్త కార్యక్రమాన్ని అందించేందుకు సిద్ధమైంది. అలనాటి తారలు రాధ, రాధిక ముఖ్య అతిథులుగా సందడి చేసిన జీ తెలుగు మెగా సంబరం‘ RRR గణేశా’. మీ అభిమాన నటీనటులు, ముఖ్య అతిథుల సమక్షంలో అంగరంగవైభవంగా జరిగిన వినాయక చవితి వేడుక RRR గణేశా ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు, మీ జీ తెలుగులో, తప్పక చూడండి!
జీ తెలుగు నటీనటులు అందరూ కలిసి ఈ వినాయక చవితిని ప్రత్యేకంగా జరుపుకోనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు రాధ, రాధిక ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రాధ, రాధిక గ్రాండ్ ఎంట్రీతో ప్రారంభమయ్యే ఈ వేడుక ఆద్యంతం మనసును హత్తుకునే ప్రదర్శనలు, కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచులతో సరదాగా సాగింది. డైలాగ్ వార్తో మొదలైన రాధ, రాధిక జట్ల మధ్య పోటీ అంత్యాక్షరీతో మరింత సబంరంగా కొనసాగింది.
ఆటపాటలతో పాటు, ఆకట్టుకునే స్కిట్‌తో డ్రామా జూనియర్స్ పిల్లల ప్రదర్శన ప్రేక్షకులను అలరిస్తుంది. అంతేకాదు, జీ తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బ్రతుకు జట్కా బండి’ని ఈ వేదికపై మరోసారి ప్రేక్షకులకు అందించారు. ఈ కార్యక్రమంలో రాధ, రాధిక ఒక జంట మధ్య సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అంశాలను ప్రతిబింబిస్తూ, జీ తెలుగు నారి శక్తిగా దీప్తి మన్నె మహిళలకు ఆత్మరక్షణ పాఠాలు నేర్పిస్తుంది.
అంతేకాదు జీ తెలుగు పాపులర్ సీరియల్స్ ‘పడమటి సంధ్యారాగం’, ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్ నటుల ప్రత్యేక ప్రదర్శనలు, మ్యూజికల్ ఛైర్స్ ఆట, జుగల్బంది డాన్స్‌తో ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది. ఈ వినోదభరిత కార్యక్రమాన్ని ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మీరూ తప్పకుండా చూడండి!
గణేష్ చతుర్థి ప్రత్యేక ఉత్సవం RRR గణేశా.. ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు, మీ జీ తెలుగులో.. డోంట్ మిస్!