పంపు సహాయంతో వరద నీటిని తీస్తున్న విజయవాడ నగరపాలక సంస్థ

Related image

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం  శనివారం ఉదయం అయోధ్య నగర్, బుడమేరు కట్ట  వద్ద సూర్య కాలనీ అయోధ్య నగర్ ప్రాంతాలలో నిలిచి ఉన్న వరద నీరును పంపు సహాయంతో ఇంజనీరింగ్ సిబ్బంది తీస్తున్న పనులను పరిశీలించారు.

 ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం మాట్లాడుతూ  విజయవాడ నగర పరిధిలో ఉన్న 64 డివిజన్లో, 32 డివిజన్లో వరద ప్రభావిత ప్రాంతాలని, 286 సచివాలయంలలో 149 సచివాలయాలు వరద ప్రభావిత ప్రాంతాలని, విజయవాడకు ప్రధానంగా ఉన్న 7 వాటర్ ట్రీట్మెంట్ ప్రాన్స్ లో, మూడు  వరదల వల్ల పాడైనప్పటికీ విజయవాడ నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ సిబ్బంది వెంటనే స్పందించి సత్వరమే మరమ్మతులు చేసి తిరిగి పునరుద్ధరిచ్చారని, ప్రస్తుతానికి 1,29,000 త్రాగునీటి కుళాయి కనెక్షన్లలకు నీటి సరఫరా జరుగుతుందని అన్నారు.

 వరద ప్రభావిత ప్రాంతాలైన  సర్కిల్ వన్ పరిధిలోని  కేఎల్ రావు నగర్, ఊర్మిళ నగర్, నిజాంగేట్, కబేలా, ఐరన్ యార్డ్, హెచ్ బి  కాలనీ, సర్కిల్ టు పరిధిలో ఉన్న సింగ్ నగర్, వాంబే కాలనీ, నందమూరి నగర్,శాంతినగర్, పాత రాజరాజేశ్వరి పేట, కొత్త రాజరాజేశ్వరి పేట లోని ప్రజలందరూ ఈ నీళ్లను త్రాగుటకు కాకుండా కేవలం వాడుటకు మాత్రమే ఉపయోగించాలని అన్నారు.

 వరద ప్రభావిత ప్రాంతాలలో 200 పైగా టాంకర్లతో త్రాగుటకు సురక్షితమైన మంచినీటి సరఫరా విజయవాడ నగరపాలక సంస్థ చేస్తుందని ప్రతిరోజు దాదాపు 25 లక్షల లీటర్లకు పైగా ప్రజలకు అందిస్తున్నదని అన్నారు. వరద నీరు ఉండిపోవటం వల్ల కేవలం ఐదు ప్రాంతాలైన రాజీవ్ నగర్, కండ్రిక, ఎన్ యస్ సి బోస్ నగర్, ప్రకాష్ నగర్, ఉడా కాలనీ లో నీటి సరఫరా ఇవ్వలేనందున ట్రాక్టర్ల సంఖ్య పెంచి    ఆ ప్రాంతాల ప్రజలకు నీటి సరఫరా చేస్తున్నారని కమిషనర్ అన్నారు.

 వరద ప్రభావం తగ్గిన తర్వాత స్కావరింగ్ చేసి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్న తర్వాతే త్రాగునీటి సరఫరా వరద ప్రభావిత ప్రాంతాలకు చేస్తామని అప్పటివరకు టాంకర్ల ద్వారానే త్రాగునీటి సరఫరా చేస్తామని, ఈ విషయం ప్రజలకు మైకు ద్వారా విధివీధిన విజయవాడ నగరపాలక సిబ్బంది తెలియపరుస్తున్నారని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రజలు కూడా  సహకరించాలని కోరారు.
  పౌర సంబంధాల అధికారి
 విజయవాడ నగరపాలక సంస్థ

VMC

More Press Releases