వినాయకుని నిమజ్జనం , సీతమ్మ వారి పాదాలు వద్దగల కృష్ణానదిలో చేయండి: వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర

Related image

వినాయక చవితిని పురస్కరించుకొని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ నగర ప్రజలకు శనివారం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ వారు  వినాయక చవితి నిమజ్జనానికి  చేసిన ఏర్పాటు తెలిపారు.

ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వినాయక చవితి అయిన తర్వాత ప్రజలు నిమజ్జనం చేసేటప్పుడు విజయవాడ నగర పాలక సంస్థ నిర్దేశించిన ప్రాంతమైన సీతమ్మ వారి పాదాలు కృష్ణా నదిలో మాత్రమే నిమజ్జనం చేయాలని,  నగర పరిధిలో ఉన్న బందర్ కాలువ, ఏలూరు కాలువ, రైవస్ కాలువల్లో నిమజ్జనం చేయవద్దని ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దాదాపు ఒక వెయ్యి వినాయకుని విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని, వాటి నిమజ్జనానికి రెండు క్రేన్లు, ఒక జెసిబి, ఒక ప్రోక్లైనర్ ఏర్పాటు చేశారని. వాటి నిర్వహణకై  నలుగురు, మూడు షిఫ్టలలో పని చేస్తారని, అందుకు అవసరమైన పారిశుధ్య నిర్వహణ, లైటింగ్ అని ఏర్పాట్లతో విజయవాడ నగరపాలక సంస్థ సిద్ధంగా ఉందని ప్రజలందరూ దీనికి సహకరించి, కేవలం విజయవాడ నగరపాలక సంస్థ వారు నిర్దేశించిన ప్రాంతమైన సీతమ్మ వారి పాదాలు, కృష్ణ నదిలో మాత్రమే నిమజ్జనం చేయవలసిందిగా ప్రజలను కోరారు.

 పౌర సంబంధాల అధికారి
 విజయవాడ నగరపాలక సంస్థ

VMC

More Press Releases