దుర్గమ్మ సన్నిధిలోపురాణపండ ' శ్రీనిధి '
ఫలాపేక్షతో ప్రమేయం లేకుండా అమ్మవారికి నిండు భక్తితో చేసే సేవకు కనకదుర్గమ్మ కారుణ్యం పొంగులెత్తుందని శ్రీదేవీ భాగవతం అనేకచోట్ల స్పష్టం చేసిన ఉత్తమ దిశలో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ప్రయాణిస్తుంటారని ఎందరో అర్చక పండితులు, మేధోసమాజం గొంతెత్తిన మంగళ అంశాన్ని నిజం చేస్తూ ఈ దసరా శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా వేల వేల భక్తులకు అందించేందుకు అమ్మవారి అనుగ్రహాన్ని మరొకసారి మంత్రమయ కలశంగా సోమవారం 'శ్రీనిధి' పేరిట దివ్యశోభల గ్రంథ లక్షప్రతులను బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి సమర్పించింది ప్రఖ్యాత ఆధ్యాత్మిక ధార్మిక ప్రచురణల సంస్థ జ్ఞాననామహాయజ్ఞ కేంద్రం.
‘శ్రీనిధి’ పరమాద్భుత గ్రంథాల గురించి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ కె.ఎస్. రామారావు మాట్లాడుతూ పురాణపండ శ్రీనివాస్ పవిత్రమయ రచనల భాషా సౌందర్యం ఒకవైపు ఆనందాన్ని కలిగిస్తుంటే , మరొక వైపు శ్రీనివాస్ ధార్మిక నిస్వార్ధ సేవ ఆశ్చర్యం కలిగిస్తుందని పేర్కొన్నారు.
సంపూర్ణంగా శ్రీవిద్యానుగ్రహం వల్లనే ఇలాంటి మంత్ర యంత్ర సంకేతాల దేవీవైభవ అంశాలను శ్రీనివాస్ అందించ గలుగుతున్నారని, ఈ నవరాత్రుల వైభవంలో ఈ గ్రంథాలు భక్త జన సందోహాన్ని దివ్యానందం వైపుగా ప్రయాణింప చేస్తాయనేది నిస్సందేహంగా అంగీకరించాలని , ఈ ఉపాసనాంశాల గ్రంథాన్ని తమదేవస్ధానానికి సౌజన్యంతో సమర్పించిన కృష్ణ ఇనిస్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ ఫౌండర్ చైర్మన్ దంపతులు బొల్లినేని కృష్ణయ్య, శ్రీమతి సుజాతలకు ఆయన ధన్యవాదాలు తెలియజేసారు.
అమ్మవారికెంతో ప్రీతికరమైన ఆదిశంకరులవంటి మహాత్ముల శ్రీదర్శనాంశాలతో రూపుదిద్దుకున్న ఈ శ్రీనిధి గ్రంథ రూపలావణ్యాన్ని దేవస్థాన అర్చక పండితులు ప్రశంసించడం శ్రీనివాస్ భక్తిమయ కృషికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు,
గత చైత్రమాసంలో సైతం సౌభాగ్య వంటి మంగళకర గ్రంధాన్ని అమ్మవారికి వేల వేల ప్రతులను సమర్పించి దేవస్థాన చరిత్రలో బొల్లినేని కృష్ణయ్య చరిత్రకెక్కారు. ఈ శ్రీనిధి గ్రంథాన్ని తెలంగాణాలోని జంటనగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలలోని ప్రధాన ఆలయాలైన పెద్దమ్మ , ఉజ్జయిని మహంకాళమ్మ , కనకదుర్గమ్మ , భాగ్యలక్ష్మీ దేవాలయాల ఉత్సవాలకు విచ్చేసే కూడా భక్త కోటికి వినియోగించనున్నట్లు కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఫౌండర్ చైర్మన్ దంపతులు బొల్లినేని కృష్ణయ్య, శ్రీమతి సుజాత ప్రకటించారు.
మరొక ఆశ్చర్యకరమైన అంశమేమంటే ...శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన శరన్నవరాత్రోత్సవాల దసరా ఘన ఏర్పాట్లలో చాలా బిజీగా ఉన్న కార్యనిర్వహణాధికారి రామారావు ఆలయంలో ఒక ప్రశాంత ప్రదేశంలో కూర్చుని ఈ గ్రంథాన్ని పారాయణం చేయడం ఆలయ సిబ్బందిని, అధికార అర్చక పండితుల్ని ఆశ్చర్యపరిచింది.