22 ఏళ్ల తర్వాత కృష్ణ వంశీ ఖడ్గం మళ్లీ వస్తోంది..
కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, శివాజీ రాజ, సంగీత, రవితేజ, ఉత్తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఖడ్గం. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో ఘనవిజయం నమోదు చేసింది. ప్రస్తుతం వున్న రీరీలిజ్ ట్రెండ్‌లో ఈ సినిమాను కూడా రీ రిలీజ్ కి ముస్తాబవుతున్న తరుణం లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ లో నిర్వహించారు. 22 ఏళ్ల తర్వాత ఈ నెల 18న ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ చిత్ర విశేషాలని పంచుకుంటూ, షఫీ మాట్లాడుతూ, “నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో చదివి ఏడేళ్లు వెయిట్ చేస్తున్న సమయం లో నాకు దొరికిన అవకాశం ఖడ్గం. ఈ సినిమా లో అవకాశం ఇచ్చి నా వనవాసం కి ఎండ్ చెప్పడానికి కారణమైన కృష్ణవంశీ గారికి కృతజ్ఞతలు.” అని చెప్పారు.
శివాజీ రాజ మాట్లాడుతూ, “నిర్మాత మధు మురళి గారికి స్పెషల్ థాంక్స్. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చి ఈ సినిమా చేసినందుకు థాంక్స్. ఇటీవలే మురారి పండుగు చేసుకున్నాం. ఇప్పుడు ఖడ్గం రీ రిలీజ్ అవుతుంది. నాకు చాలా సంతోషం గా ఉంది. నేను ఖడ్గం లో చేయను అని చెప్పాను. కానీ ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో అన్నిటిలో మంచి పేరు వచ్చింది.” అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, “జనరేషన్స్ మారినా పెట్రియేటిక్ ఫిల్మ్స్ అన్నిటిలో ఖడ్గం ఇదొక గొప్ప చిత్రం. అసలు ఖడ్గం సినిమా లో నిర్మాత మధు మురళి నన్ను వద్దు ఆన్నారు ముందు. కానీ వంశీ ధైర్యం చేసి ఆయన్ని ఒప్పించి నన్ను సినిమాలోకి తీసుకున్నారు. నా లైఫ్ లో ఈ సినిమా మర్చిపోలేను. ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది.” అన్నారు.
దర్శకులు కృష్ణవంశీ మాట్లాడుతూ, “మాకు ఈ సినిమా తీయడం లో సహాయం చేసిన నిర్మాత మధు మురళి గారికి ధన్యవాదాలు. భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో ఈ సినిమా కి ఆ టైటిల్ పెట్టి సినిమా తీశాం. ఈ సినిమా కి సహకరించిన నటీనటులందరికీ థాంక్స్.” అని చెప్పారు.