2024 సంవత్సరానికి జీ తెలుగు ఘనమైన వీడ్కోలు.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ సరిపోదా శనివారం, ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు!

Related image


హైదరాబాద్, 24 డిసెంబర్ 2024: వారం వారం సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ ఆదివారం మరో బ్లాక్బస్టర్ మూవీతో వచ్చేస్తోంది. నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ నటించిన సరిపోదా శనివారం సినిమాతో 2024 సంవత్సరానికి ఘనమైన వీడ్కోలు పలికేందుకు సిద్ధమైంది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం డిసెంబర్ 29 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో మాత్రమే.
తల్లికి ఇచ్చిన మాటకోసం సూర్య (నాని) తన కోపాన్ని వారంలో ఆరు రోజులు అదుపులో ఉంచుకొని శనివారం మాత్రం తనకు అన్యాయం చేసిన వారిపై పగ తీర్చుకుంటాడు. సోకులపాలెంలో జరిగిన ఒక విషాద ఘటన సిఐ దయా (ఎస్.జె.సూర్య పాత్ర)ని సూర్యకి పరిచయం చేస్తుంది. దయాని ఎదుర్కొనేందుకు సూర్యకి పోలీస్ కానిస్టేబుల్ చారులత (ప్రియాంక మోహన్)  సహాయపడుతుంది. అసలు దయాపై సూర్య కోపానికి కారణమేంటి? రాజకీయ నాయకుడు కూర్మానందం (మురళీ శర్మ) ఎలా సమస్యల్లో పడతాడు? అసలు చారులత ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారమయ్యే సస్పెన్స్ యాక్షన్ డ్రామా సరిపోదా శనివారం సినిమా చూడాల్సిందే.
 
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో నాని, ప్రియాంక మోహన్ హీరోహీరోయిన్లుగా నటించగా ఎస్.జె.సూర్య, మురళీశర్మ, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, శివాజీరాజా, అభిరామి, అదితిబాలన్, అజయ్ ఘోష్, విష్ణు ఓయ్, హర్షవర్ధన్, అజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ సరిపోదా శనివారం సినిమాతో జీ తెలుగుతో కలిసి ఈ ఏడాదిని మీరూ ఘనంగా ముగించేయండి!
జీ తెలుగు అందిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం.. ఈ ఏడాది చివరి ఆదివారం డిసెంబర్ 29న సాయంత్రం 5:30 గంటలకు, తప్పక చూడండి!

More Press Releases