అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు తెలంగాణ అటవీ శాఖ చర్యలు
ఇటీవల అటవీ ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల దృష్ట్యా ప్రత్యేక ఆదేశాలు. (జరిగిన మూడు ప్రమాదాలకు కూడా మానవ నిర్లక్ష్యం వల్ల అని విచారణలో తేలింది.
రక్షిత అటవీ ప్రాంతాల్లో ప్రవేశంపై ఆంక్షలు. నల్లమల గుండా శ్రీశైలం వెళ్లే భక్తులు అటవీ శాఖ సూచనలు తప్పకుండా పాటించాలి.
అడవిలో నిర్దేశించిన ప్రాంతాలు, రోడ్ల ద్వారానే ప్రయాణించాలి, అటవీ మార్గాల్లో కాలి బాటల్లో ప్రయాణంపై నిషేధం.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విరామ ప్రాంతాల్లో సేద తీరేందుకు అనుమతి.
అక్కడ తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్న అటవీ శాఖ.
అడవిలో నిప్పు రాజేయటం, వంటలపై నిషేధం.
అమ్రాబాద్, కవ్వాల్ అభయారణ్యాలతో పాటు, రక్షిత అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పెట్రోలింగ్.