అమృతేశ్వరునికి పురాణపండ ‘సహస్ర’ పత్రాలతో కొర్రపాటి శివ పూజ

Related image
శరణుజొచ్చినవారికి అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం నుండీ భక్తకోటి ఉపాసించుకుని తరించేందుకు శ్రీ అమృతేశ్వర దేవస్థానం ఫౌండర్ ట్రస్టీలు సాయి కొర్రపాటి, శ్రీమతి రజనీ కొర్రపాటి దంపతులు ‘సహస్ర’ పేరిట సుమారు రెండువందల యాభైపేజీల చక్కని పవిత్ర తెలుగు భక్తి గ్రంథాన్ని ఉచితంగా పంచడం పలువురు రాజకీయ సామాజిక భక్త ప్రముఖుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప వ్యాఖ్యానాలతో, ఋషుల స్తోత్ర విద్యలతో ‘సహస్ర’ పేరిట ధార్మిక జీవన ప్రార్ధనా గ్రంథంగా సాయి కొర్రపాటి సమర్పణలో అందిన ఈ గ్రంథం ప్రస్తుతం బళ్లారిలో వందలకొలది గృహాలలో పారాయణాగ్రంథంగా మారినట్లు భక్తకోటి శ్రీ అమృతేశ్వరదేవస్థానంకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

శ్రీ అమృతేశ్వరుని స్వరూపంగా స్పటిక మహాలింగంతో గత సంవత్సరం ప్రతిష్ఠితమైన ఈ అద్భుతమైన ఆలయ వైభవ రూప దర్శనానికి విచ్చేసే భక్తులు అభిషేకం అనంతరం గత కొంత కాలంగా ఈ విశేష శక్తుల సహస్ర గ్రంథాన్ని మహా ప్రసాదంగా తీసుకెళ్తున్నట్లు మన కనులముందు కనిపించే సత్యం.

20250624fr685a3832b2808.jpg   ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కలం వర్షించే అమృత రసధారల్లాంటి అమోఘ గ్రంథాలకు బెంగళూరు, బళ్లారి వంటి ప్రాంతాలలో తెలుగు వారు ఎక్కువమంది ఫాలోయర్స్ ఉన్నారు. దర్శకధీరుడు, ఆర్ఆర్ఆర్  ఫేమ్ ఎస్ ఎస్ రాజమౌళి, కేజీఎఫ్ హీరో యశ్, ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, ప్రముఖ జానపదగాయని మంగ్లీ, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ వంటి ప్రముఖులెందరో శ్రీ అమృతేశ్వరస్వామి ఆలయ ప్రారంభ వేడుకలో పాల్గొన్న అంశం ఇప్పటికీ బళ్లారి ప్రజలు చెప్పుకుంటూంటారు.

వారాహి చలన చిత్ర అధినేత సాయి కొర్రపాటి శివ భక్తుడు కావడం వల్ల బళ్లారికి ఈ అద్భుతం లభించిందని బళ్లారి కమ్మసంఘం ప్రముఖులు సైతం వేనోళ్ళ ప్రశంసలు వర్షిస్తున్నారు. చాలా ఆలయాల్లో దైవ గ్రంథాలు అమ్ముతున్న ఈరోజుల్లో భక్త కోటికి ఇంత మంచి సహస్ర గ్రంధాన్ని శ్రీ అమృతేస్వరుని కటాక్షంగా ఉచితంగా ఇవ్వడాన్ని అభినందిస్తున్నారు.

వేద పండితులు, అర్చకులు మాత్రమే కాకుండా భక్తులు సైతం హాయిగా చదువుకునే అనేక స్తోత్రాలు, అందమైన వ్యాఖ్యానాలు ఈ బుక్ నిండా ఉండటం వల్ల బళ్ళారి తెలుగు భక్తుల్ని ఈ సహస్ర గ్రంథం విశేషంగా ఆకట్టుకోవడం గమనార్హం.

గతంలో సాయికొర్రపాటి సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ దేశంలో తొలిసారిగా ఐదువందల ఆంజనేయస్వామి అరుదైన చిత్రాలతో, యంత్ర మంత్ర తంత్రాత్మకంగా అద్భుత రచనా సంకలనంగా పరమ శోభాయమానంగా రూపుదిద్దిన అఖండ భారీగ్రంధం ‘నేనున్నాను’ని రెండేళ్లనాడు భారతదేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా ఆవిష్కరించి.. ప్రచురణకర్త సాయి కొర్రపాటిని, గ్రంథ రచయిత పురాణపండ శ్రీనివాస్ లపై అభినందనలు వర్షించిన విషయం పాఠకులకు ఎరుకే!

ప్రమాణాలు పాటించడంలో రాజీపడని మనస్తత్వంతో అద్భుత గ్రంథాలు రచించి వేల వేల అభిమానుల్ని సంపాదించుకున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్, సాయి కొర్రపాటికి అత్యంత ఆప్తుడని కొర్రపాటి సాయి సన్నిహితులు చెబుతున్నారు. సినీరంగంలో కొర్రపాటి సాయికి రాజమౌళి చాలా ఆంతరంగిక  ఆత్మ బంధువని కన్నడ తెలుగు రంగాలకు తెలుసున్న విషయమే. ఈ క్రమంలో కొర్రపాటి పవిత్ర కార్యక్రమాలకు ఆప్తుడు పురాణపండ శ్రీనివాసేనని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
PURANAPANDA SRINIVAS
SAI KORRAPATI
SRI AMRUTHESWARA DEVASTHANAM BELLARY
VAARAAHI CHALANA CHITRAM
PURANAPANDA SAHASRA BOOK

More Press News