ఆగస్ట్ 30న దుబాయ్‌లో గామా అవార్డ్స్ 2025

Related image
ప్రతిష్టాత్మమైన GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ కు టాలీవుడ్‌లో  స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు  అంగరంగ వైభవంగా జరిగాయి.   తాజాగా  2025 – 5వ ఎడిషన్ వేడుకలు  ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌‌లో గ్రాండ్‌గా జరగనుంది.

దుబాయ్ లో జరిగిన Keinfra Properties ప్రారంభోత్సవ సందర్భంగా
గామా 5th ఎడిషన్ కు సంబంధించిన థీమ్ సాంగ్ ను శనివారం దుబాయిలో లాంఛ్ చేశారు.
ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు ఈ పాటకు అద్భుతమైన ఆకట్టుకునే సాహిత్యం అందించారు. రఘు కుంచె సాంగ్ కంపోజ్ చేయడంతో పాటు తానే స్వయంగా పాడిన తీరు అందరినీ అలరించింది.ఈ సంగీత ప్రదర్శనను యూఏఈ లోని తెలుగు ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించారు.ఆగస్టు 30న  టాలీవుడ్ అవార్డ్స్ తో పాటు ఆగస్టు 29న  ఎక్సలెన్స్  అవార్డ్స్  వేడుకను నిర్వహించేలా భారీ సన్నాహాలు జరుగుతున్నాయి.


ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు, రోషన్.. హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, దక్ష నాగర్కర్ తో పాటు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అగ్ర కథానాయకులు, టాప్ టెక్నీషియన్స్ పాల్గొనబోతున్నారు.
అలాగే హీరోయిన్స్ ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా,  ప్రియా హెగ్డే, శ్రీదేవి  స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో అలరించనున్నారు.

ప్రత్యేక అతిధులుగా బ్రహ్మానందం, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు, బాబీ, సాయి రాజేష్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్, నిర్మాతలు అశ్విని దత్, డివివి దానయ్య, చంద్రబోస్,   వెన్నెల కిషోర్ తదితర ప్రముఖులు హాజరవనున్నారు. వీరితో పాటు పలువురు టాలీవుడ్ అగ్రశ్రేణి నటీనటులు సర్ ప్రైజ్ గెస్ట్ లుగా హాజరు కానున్నారు.
అతిరథ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా జరగనున్న ఈ అవార్డ్స్ వేడుక కోసం చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 టాలీవుడ్ 24 క్రాఫ్ట్స్ కు ఈ అవార్డ్స్ ను అందించనున్నారు.  2024లో విడుదలైన చిత్రాల్లో   నామినేటె అయిన విభాగాలకు, పబ్లిక్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా సెలెక్ట్ చేస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ వేడుకకు  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత, కళా రంగ ప్రముఖులు, ప్రతిభావంతులు, సినీ పరిశ్రమకు చెందిన లెజెండ్స్ ఈ గామా అవార్డ్స్ 2025 లో పాల్గొననున్నారు.  ఈ ఏడాది కూడా పలు పాపులర్ చిత్రాలు, స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్, టాప్ టెక్నీషియన్స్ గామా అవార్డులను అందుకోనున్నారు.

ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించి గ్రాండ్ రివీల్ ఈవెంట్‌ను దుబాయ్‌లో నిర్వహించగా అద్భుతమైన స్పందన వచ్చింది.   మైత్రి ఫార్మ్‌లో గామా అవార్డ్స్ 5వ ఎడిషన్‌ టిక్కెట్లను మహిళలు విడుదల చేశారు.  

గామా అవార్డ్స్ 2025   జ్యూరీ చైర్ పర్సన్స్  ప్రముఖ సినీ దర్శకులు -  ఏ. కొదండ రామిరెడ్డి ,   ప్రముఖ సంగీత దర్శకులు - కోటి ,  ప్రముఖ సినీ దర్శకులు - బి. గోపాల్  ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు  GAMA అవార్ద్స్  బహుకరించబడతాయి.

ఈ సందర్భంగా ‘గామా అవార్డ్స్’ చైర్మన్ త్రిమూర్తులు గారు మాట్లాడుతూ ‘ దుబాయ్ లో జరిగే ఏకైక అతి పెద్ద వేడుక గామా అవార్డ్స్. గత నాలుగు ఎడిషన్లు ఘనంగా పూర్తి చేసుకున్నాం. ఆగస్ట్ 30న  జరగబోయే 5వ ఎడిషన్‌ను కూడా  మన తెలుగు వారు అందరూ , ఈ కార్యక్రమానికి సహకరించి, అధిక సంఖ్యలో హాజరు అయ్యి విజయవంతం చేయాలి’ అని అన్నారు.

‘గామా అవార్డ్స్’  సీఈవో సౌరభ కేసరి మాట్లాడుతూ ‘వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గుర్తించి వారికి ది గామా ఎక్సలెన్స్ అవార్డ్స్ (THE GAMA EXCELLENCE AWARDS) ఇచ్చి సత్కరించనున్నాం.  విశాలవంత మైన పార్కింగ్ కలిగిన షార్జా ఎక్స్‌పో  సెంటర్ లో 10 వేల మంది ఆసీనులు అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వినూత్న రీతిలో జరగబోయే ఈ అవార్డ్స్ కార్యక్రమంలో  ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు, అందర్నీ అలరించే వినోద కార్యక్రమాలు, అద్భుతమైన  షోలు  ఉంటాయి’ అని చెప్పారు.

 గతేడాది జరిగిన  ‘గామా’ 4వ ఎడిషన్‌లో 2021 నుంచి 2023 మధ్యలో విడుదలైన చిత్రాల నుంచి బెస్ట్ యాక్టర్స్ (మేల్, ఫిమేల్), బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్, బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సెలబ్రిటీ సింగర్‌‌తో సహా మొత్తం 42 కేటగిరీలకు అవార్డులను అందించారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గామా మూవీ ఆఫ్ ది డికేడ్ అవార్డు కైవసం చేసుకోగా, బెస్ట్ యాక్టర్ కేటగిరీలో  2021కు గానూ అల్లు అర్జున్ (పుష్ప),  2022కు  గానూ నిఖిల్ (కార్తికేయ2), 2023కు గానూ ఆనంద్ దేవరకొండ  (బేబీ) అవార్డులను అందుకున్నారు
Gama awards
Gulf Academy Movie Awards

More Press News