పంచాయతీ రాజ్ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్
పల్లె ప్రగతి సమగ్ర నిర్వహణ కోసం.. పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నందన గార్డెన్స్ లో నేడు ఏర్పాటు చేసిన పంచాయతీ రాజ్ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, శంకర్ నాయక్, జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈఓ సన్యాసయ్య, డి.ఎఫ్.ఓ కృష్ణ గౌడ్, డీఎస్పీ నరేష్ కుమార్, ఇతర అధికారులు.
సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్:
పల్లె ప్రగతి విజయవంతం చేయాలని అనుకున్నాం కానీ 11వ స్థానంలో ఉన్నాం.
వచ్చే పల్లె ప్రగతిలో రాష్ట్రంలో మొదటి స్థానానికి మన జిల్లా వచ్చేలా అందరం సమిష్టి కృషి చేయాలని కోఋతున్నాను. మనం ఫోటోల కోసం కాకుండా ప్రగతి నిజంగా జరిగేలా పని చేద్దాం.
సీఎం కేసీఆర్ గారు రాజకీయాలుకతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందరికి అందిస్తున్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
పల్లె ప్రగతిలో మిగిలిన పనులల్ని పూర్తి చేయండి.
25వ తేదీ తర్వాత మంత్రులు పల్లె నిద్రలు చేస్తున్నారు. మీరు కూడా అందరూ పల్లె నిద్రలు చేసి గ్రామ ప్రజలకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించాలి, సీఎం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి.
గ్రామాల్లో 3rd ఫేస్ లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉండొద్దని సీఎం కేసీఆర్ గారు చెప్పారు.
విద్యుత్ లైన్స్ వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటిని సరిదిద్దాలని చెప్పారు.
ఇప్పుడొచ్చిన సర్పంచులు నిజంగా అదృష్ట వంతులు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత మీరు నీళ్లకు ఖర్చు పెట్టే బాధ తప్పింది.
మనిషి చనిపోతే స్నానం చేయడానికి నీళ్లు ఇవ్వడానికి కరెంట్ కోసం కొట్లాడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 24 గంటల నాణ్యమైన విద్యుత్ నిరంతరం ఉండడం కూడా సర్పంచులకు చాలా ఉపయోగపడే అంశం. సర్పంచులకు గొప్ప అవకాశం వచ్చింది. మంచిగా చేసే సర్పంచులకు నిధులు ఇస్తాం.
మీ 5 ఏళ్ల పదవీకాలం అయ్యే నాటికి మన దగ్గర ప్రతి గ్రామం గంగాదేవి పల్లి వలె కావాలి.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా స్త్రీలు, శిశువులకు అందజేయాలి.
దేశానికి తెలంగాణ ఒక రోల్ మోడల్ గా నిలుస్తోంది. అదేవిధంగా మన జిల్లా కూడా రాష్ట్రానికి రోల్ మోడల్ అయ్యేలా పని చేద్దాం.
అడవులను కాపాడుకోవడం, వాటిని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది.
పల్లె ప్రగతిలో గ్రామంలో అందరిని భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలి.
పల్లె ప్రగతిలో సర్పంచులు హీరోలు, డైరెక్షన్, ప్రొడ్యూసర్ సీఎం కేసీఆర్ గారు.
అనంతరం150 ట్రాక్టర్లు సర్పంచులకు పంపిణీ చేశారు....వీటిని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి.