ఎస్ఆర్ఎస్పీ రెండవ దశ కాలువల మరమ్మతులు చేపట్టండి: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశం
- అధికారులకు మంత్రి ఆదేశాలు
- హైదరాబాద్ లో అధికారులతో సమీక్ష
ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసి ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి విడుదల చేసిన నీటితో ఈ యాసంగి పంటకు సూర్యపేట జిల్లాలో సమృద్ధిగా నీళ్లు అందించగలిగామని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూర్యపేట జిల్లా ప్రజలు రుణపడి ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే అదే సమయంలో ఎప్పుడో తవ్వి వదిలేసిన ఎస్ఆర్ఎస్పీ రెండవ దశ కాలువల నిర్మాణం లోపభూయిష్టంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం నుండి గోదావరి జలాలు విడుదల చేసినప్పుడు ఈ విషయం బయట పడిందన్నారు. ఇది గమనించిన మీదటే వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి స్థాయిలో నిరందించేందుకుగాను కాలువల మరమ్మతులు ఇతరత్రా తవ్వకాలు చేపట్టేందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాలువల మరమ్మతులపై స్థానిక సంస్థల ప్రతినిధులు లేవనెత్తిన అనుమానాలు నివృత్తి చెయ్యడంతో పాటు బయ్యన్న వాగు నుండి విడుదల చేస్తున్న నీటి సామర్ధ్యాన్ని పెంచే విదంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.
ప్రతిపక్షాలు ప్రజాదరణ కోల్పోయాయి:
ప్రతిపక్షాలు ప్రజాదరణ కోల్పోయాయని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి ప్రజాదరణ కొల్పయిన వారి గురించి మాట్లాడడంలో అర్థం లేదని ఆయన అన్నారు. ఎస్ఆర్ఎస్పీ రెండవ దశ కాలువల మరమ్మతులు, నీటిపారుదలపై సమీక్షించిన మీదట మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సూర్యపేటకు కాళేశ్వరం జలాలు రావంటూ విపక్షాలు చేసిన కామెంట్ ను విలేఖరులు మంత్రి దృష్టికి తీసుకరాగా ఆయనపై విదంగా స్పందించారు. కాళేశ్వరం జలాలు సూర్యపేటకు వస్తే ఒకరేమో సన్యాసం తీసుకుంటానని మరొకరు గులాబీ జెండాకు జై కొడతానంటూ ప్రగల్భీంచారని ఇప్పుడు వారు ప్రజలకు మొహం చాటేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్ట్ ల నిర్మాణల పై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు కొంత జాప్యం జరిగిందని ప్రభుత్వ పరంగా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. డిండి విషయంలోనూ భూసేకరణ పూర్తి కాగానే పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు.
పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా సరఫరా:
పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డిమాండ్ కు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే రెట్టింపు అయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 40 లక్షల విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. లిఫ్ట్ ఇరిగేషన్ లతో పాటు వ్యవసాయం గృహ వినియోగం పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరాతో డిమాండ్ పెరిగిందని ఆ డిమాండ్ ఎంత ఉన్నా సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.