సీఎం కేసీఆర్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి

Related image

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో కరోనా వ్యాది ప్రభలిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ముందస్తూ జాగ్రత్తల నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన నియమ నిబందనల (ఈ నెల 31 వరకు) మేరకు రాష్ట్ర ప్రజలందరూ తూచా తప్పకుండా పాటించాలని రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేసారు. ప్రతి చిన్న సమస్యకు నియేజక వర్గం నుండి హైదరాబాద్ కు గుంపులు, గుంపులుగా రాకుండా ఉండాలని సూచించారు. ఎంతో అత్యవసరం అయితే మాత్రమే, తగు జాగ్రత్తలతో ఇంటి నుండి బయటికి రావాలని సూచించారు. తన నియేజక వర్గ ప్రజల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.

తన నియేజక వర్గ ప్రజలతో పాటు తన శాఖ పరమైన సమస్యలు ఉన్నచో మంత్రిని పోన్ ద్వారా సంప్రదించిన, తెలియజేసిన వారి సమస్యలను సంబందిత అధికారులకు ఆదేశాలు జారీచేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు, వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిరంతరం వైద్య శాఖ అధికారులతో ఎప్పటికప్పుుడు పరిస్థితిని సమీక్షిస్తూన్నారన్నారు.

రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ముందస్తూ గా పాఠశాలకు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించటం జరిగిందన్నారు. దయచేసి ప్రజలందరూ తమ పిల్లలతో గ్రామాలకు, వివాహ విందులకు, శుభకార్యాలకు వెల్లకుండా స్వీయ నియంత్రణతో పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు వైద్యులు సూచించిన విధంగా రెండు వారాలు పాటు ఇంటిలోనే ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

ప్రజలందరూ తమ స్వీయ నియంత్రణను పాటించి కరోన వ్యాదిని మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభలకుండా జాగ్రత్తపడి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

More Press Releases