తెలంగాణ ఎన్నో అవరోధాలను అధిగమించింది: మంత్రి నిరంజన్ రెడ్డి
- ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దూరదృష్టి మూలంగా సవాళ్లను ఎదుర్కోగలిగాం
- గ్రామీణ వ్యవస్థ బలోపేతం చేయడంకోసం అనేక చర్యలు చేపట్టాం
- 60 శాతం జనాభా ఉన్న, వ్యవసాయం మీద ఆధారపడ్డ గ్రామీణ ప్రాంతాలు నిలదొక్కుకోవాలన్నదే లక్ష్యంగా భావించాం
- మిషన్ కాకతీయతో 46 వేల చెరువుల పునరుద్దరణ
- దీంతో ఈ చెరువుల పరిధిలోని వ్యవసాయ ఆధారిత ప్రజలకు 78 శాతం ఆదాయం అదనంగా పెరిగింది
- చెరువులలో ఉచితంగా చేపపిల్లలు విడుదల చేయడం మూలంగా మత్య్సకారుల ఆదాయం 35 శాతం పెరిగింది
- 265 టీఎంసీల నీటి నిలువ సామర్ధ్యాన్ని చెరువుల ద్వారా పునరుద్దురించుకున్నాం
- మిషన్ భగీరధతో రూ.43,791 కోట్ల వ్యయంతో 2.32 కోట్ల జనాభా ఉన్న 20.60 లక్షల ఆవాసాలకు శుద్దజలం తాగునీరు అందించే పథకాన్ని మొదలుపెట్టి పూర్తి చేశాం
- రాష్ట్రంలోని 58.33 లక్షల రైతులకు 1.43 కోట్ల ఎకరాల సాగుభూమి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది
- వీరందరికీ రైతుబంధు పథకం అమలు చేయడం జరుగుతుంది. ఏడాదికి రెండు సార్లు వారికి పంట పెట్టుబడి కింద ప్రభుత్వ సాయం అందుతుంది
- తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తనకేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది
- ప్రతిష్టాత్మక ఇస్టా 32వ సదస్సు తొలిసారి ఆసియాలో అదీ తెలంగాణలో నిర్వహించుకోవడం జరిగింది
- ఈ సదస్సు విజయవంతం కావడంతో తెలంగాణ ప్రతిష్ట మరింత పెరిగింది - ప్రపంచంలోనే ఎత్తయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఓ ఇంజనీరింగ్ అద్భుతం
- రూ.80 వేల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢనిశ్చయంతో కేవలం మూడేళ్లలో పూర్తయింది
- ప్రపంచంలోనే ఎవరూ చేపట్టని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుభీమా పథకం చేపట్టారు
- ప్రభుత్వమే భీమా చెల్లించి మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వడం ఆ కుటుంబాలకు గొప్ప ఊరట
- రైతులు, ప్రభుత్వం, బ్యాంకులను అనుసంధానం చేసే సంస్థ నాబార్డు
- వ్యవసాయ రంగానికి నాబార్డు సేవలు ప్రశంసనీయం
- రైతులకు రుణాలిచ్చి అండగా నిలవబడుతుంది
- మిషన్ భగీరధకు రూ.4800 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు ఇచ్చినందుకు నాబార్డుకు ధన్యవాదాలు
- తెలంగాణ సంక్షేమ, అభివృద్ది పథకాలకు నాబార్డు అందిస్తున్న సాయం మరవలేనింది
- భవిష్యత్ లో ఈ సహకారాన్ని కొనసాగించాలి
- నాబార్ఢు 38 వార్షికోత్సవ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- పాల్గొన్న ఆంధ్రా బ్యాంక్ ఎండీ, సీఈఓ ఫకీర్ సామి, రిజర్వ్ బ్యాంక్ రీజనల్ డైరెక్టర్ సుబ్రతా దాస్, నాబార్డ్ ఫార్మర్ చైర్మన్ కోటయ్య, ఏపీ నాబార్డ్ సీజీఎం సెల్వరాజ్, నాబార్డ్ తెలంగాణ సీజీఎం విజయ్ కుమార్ తదితరులు