సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణకు రానున్న జెట్టి గురునాధరావు పిల్
రైతు రుణమాఫీ నాలుగు, ఐదు విడతల బకాయిలు చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కిసాన్ సెల్ చైర్మన్ జెట్టి గురునాథ రావు దాఖలు చేసిన పిల్, (WP(PIL)103/2019, IA 1/2019) సోమవారం (15-07-2019)న ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ యం. సత్యనారాయణమూర్తి ముందు 65ఐటెంగా విచారణకు రానుంది. రైతు రుణమాఫీ నాలుగు, ఐదు విడతలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జి. ఓ 38 ను (10 మార్చి 2019) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంను ఆదేశించాలని పిల్ లో కిసాన్ సెల్ కోరింది. నాలుగు, ఐదు విడతల రైతు రుణమాఫీ సొమ్మును 30 లక్షల రైతుల ఖాతాలో జమచేయాలని ఆదేశించాలని పిల్ లో కిసాన్ సెల్ ఛైర్మెన్ జెట్టి గురునాధరావు కోరారు.