ప్రతిరోజు రెండు పూటల ఉచిత భోజనం అందిస్తున్న పువ్వాడ ఫౌండేషన్
వివిధ రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వచ్చిన కూలీలతో పాటు పేదవారికి కోసం ఖమ్మం నగరంలో పువ్వాడ ఫౌండేషన్ ద్వారా ప్రతి రోజు మద్యాహ్నం, రాత్రి రెండు పూటల ఉచితంగా 1000 మందికి రూ.5 భోజన కేంద్రం ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ లో నగరంలో వివిధ పనులు చేసుకునే వారికి వెసులుబాటు ఉండేందుకు ఖమ్మం నగరంలో 3టౌన్ గాంధీచౌక్, పెవిలియన్ గ్రౌండ్, ఎన్టీఆర్ సర్కిల్ లోని రూ.5 భోజన కేంద్రాల ద్వారా ఉచితంగా భోజనం అందుబాటులో ఉంచామని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు.
ఏ ఒక్కరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో పువ్వాడ ఫౌండేషన్ నుండి నగరంలోని మూడు రూ.5 భోజన కేంద్రాల ద్వారా ప్రతి రోజు 1000 మందికి ఉచిత భోజనం సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఒరిస్సా, మహారాష్ట్ర, కలకత్తా, నాందేడ్, బీహార్ రాష్ట్ర వలస కార్మికులు వివిధ సంస్థల్లో, వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్న వారికి భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ రోజు నుండి ఉచిత భోజన సౌకర్యంను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. భోజన కేంద్రం వద్ద చేతులను శుభంగా కడుకునేందుకు సబ్బు, హాండ్ వాష్, శాన్టిలైజర్ ను అందుబాటులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS, కమీషనర్ ఆఫ్ పోలీస్ తఫ్సిర్ ఇక్బాల్ IPS, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి IAS తదితరులు ఉన్నారు.