పీఎం, సీఎం సహాయ నిధులకు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ చేయూత
- ప్రధాని సంరక్షణకు నిధికి నెల జీతం, సిఎం సహాయ నిధికి రూ.లక్ష
విశాలమైన జాతీయ భావాలు కలిగిన హరిచందన్ మరోవైపు ప్రధాని సంరక్షణ నిధికి సైతం తన నెల రోజుల జీతాన్ని విరాళంగా సమకూర్చాలని నిర్ణయించి ఆమేరకు నిధులను బదిలీ చేయాలని రాజ్ భవన్ కార్యదర్శి ముఖేష్ కుమర్ మీనాను ఆదేశించారు. ప్రస్తుత పరిస్ధితులలో ప్రతి ఒక్కరూ దాతృత్వం చూపాలని, దాతలు సమకూర్చే ప్రతి రూపాయి ఈ దేశంలో ఆరోగ్య పరిస్ధితులను మెరుగు పరిచేందుకు ఉపయోగపడుతుందని గవర్నర్ అన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి సామాజిక దూరం పాటించటం మాత్రమే కీలకం అయినందున, ప్రతి ఒక్కరూ తదనుగుణంగా వ్యవహరించాలన్నారు.