భారతీయుల దీక్ష, దక్షతలకు ప్రతిరూపంగా జ్యోతీప్రజ్వలన: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్
- ప్రధాని పిలుపుకు ప్రతి స్పందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
- కాంతి వెలుగులతో కరోనా చీకటికి ముగింపు తధ్యం
ప్రత్యేకించి రాజ్ భవన్ సెక్యురిటీ సిబ్బంది తమదైన శైలిలో క్రమశిక్షణతో దీపాల వెలుగులు ప్రసరింపచేసారు. ఈ సందర్భంగా గవర్నర్ సందేశం ఇస్తూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లవద్దనే ఉండి ఇళ్లల్లోని విద్యుత్ దీపాలను ఆపేసి, జ్యోతులు వెలిగించి, తమ ధృఢ సంకల్పాన్ని వెల్లడించటం సహేతుకమైన పోరాటానికి నిదర్శనమన్నారు. జనతా స్ఫూర్తిని మరోమారు చాటుతూ, రాష్ట్ర ప్రజలు తమ విలువైన సమయంలో ఓ 9 నిమిషాలు దేశం కోసం కేటాయించటం అభినందనీయమన్నారు. చమురు దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు, సెల్ఫోన్ ఫ్లాష్ లైట్లు ... ఇలా ఏదోక రూపంలో కాంతిని ప్రజ్వలింప చేసి కరోనా చీకటిని తరిమేద్దాం అన్న సంకల్పం ప్రదర్శించటం వల్ల భారతీయులు ఏదైనా సాధించగలరన్న విషయం ప్రపంచానికి చాటినట్లయ్యిందన్నారు.