జీతంలో కోతకు స్వచ్చందంగా ముందుకు వచ్చిన ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్
- జీతంలో కోతకు స్వఛ్చంధంగా ముందుకు వచ్చిన గవర్నర్ బిశ్వ భూషణ్
- కరోనా కట్టడి చర్యలకు తనవంతు చేయూత
- రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు అంగీకార లేఖ
పార్లమెంటు సభ్యుల నిధుల రద్దు, వారి జీతాలలో కోత వంటి వాటితో పాటు, రాజ్యాంగ అధినేతలుగా ఉన్న రాష్ట్ర పతి, ఉప రాష్ట్ర పతి, గవర్నర్లు స్వచ్చందంగా జీతాల కోతకు ముందుకు వస్తున్నారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ తన జీతం నుండి ప్రతి నెల 30 శాతం నిధులను మినహాయించి కరోనా కట్టడికి వ్యయం చేయాలంటూ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు లేఖ రాశారు. గవర్నర్ ఆదేశాల మేరకు రాజ్ భవన్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తూ సామాజిక బాధ్యతలో భాగంగా గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని, తదనుగుణ ఏర్పాట్లు చేయాలని కోరారు.