లక్ష ఇళ్లకు కూరగాయలు అందించాం: ఏపీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ :11 రోజులలో పశ్చిమ నియోజకవర్గంలోని ఒక లక్ష ఇళ్లకు కూరగాయలను పంపిణీ చేయడం జరిగిందని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం కేబీఎన్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వార్డు వాలంటరీలు, గ్రామ వాలంటీరీలు, పారిశుద్ధ్య కార్మికులను పోలీసులు వైద్యులు ఎలా కష్టపడుతున్నారో మా వైయస్సార్సిపి పార్టీ నాయకులు ప్రాణాలకు తెగించి అలాగే కష్టపడుతున్నారని, వారి సేవలు అభినందనీయమని ఆయన అన్నారు. కరోనాపై యుద్ధం బలంగా సాగుతుందని, ఏపీలో అతి తక్కువ కరోనా కేసులు నమోదు కావడానికి సీఎం కృషి ఫలితమే అని అన్నారు. అప్పుల్లో ఉండి కూడా ప్రజలకు మేలు చేయాలని సీఎం చూస్తున్నారని, ఈనెల 16 నుంచి రెండో విడత రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు హైదరాబాదులో ఉండి ప్రతిరోజు రాజకీయం చేయాలని చూస్తున్నారని తెలిపారు. విజయవాడలో ఉన్న ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంట్లో కుర్చీని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. 12 గంటల నిరాహార దీక్ష పేరుతో డైటింగ్ చేస్తున్నారని, ప్రజలు బాధలో ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారని మంత్రి అన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళి: తొలుత అంబేద్కర్ 129వ దినోత్సవం సందర్బంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పూలమాలవేసి నివాళులర్పించారు.