కరోనా వ్యాధి నివారణ చర్యలపై మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారుల సమావేశం

Related image

కరోన వ్యాధి నివారణ చర్యలో భాగంగా లాక్ డౌన్ మే 3వ తేదీ వరకు పొడగించడంతో జీహెచ్ఎంసి అధికారులు ఇటు పోలీస్ అటు మెడికల్ అధికారులతో సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పారిశుధ్య చేయడంలో అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. నేడు బేగంపేటలోని మంత్రి కేటిఆర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ అధికారుల సమావేశంలో కరోనా వ్యాధి నివారణ చర్యలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో గుర్తుంచిన ప్రాంతాల్లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలు ఎక్కడ గుమిగూడకుండా ఏప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పోలీస్ మరియు మెడికల్ అధికారులకు సహకరించాలని, అవసరమైన ప్రాంతాల్లో ఇంటికే నిత్యావసర సరుకులు పంపిణీ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు వైద్య లేదా ఇతర సేవల కోసం 104 లేదా 040 21111111 నెంబర్ కు కాల్ చేసి సహాయం పొందవచ్చని, అధికారుల బృందం కంట్రోల్ రూమ్ లలో డే అండ్ నైట్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

ఆయా ప్రాంతాల్లో కావలసిన ఏర్పాట్లను చేసుకోవాలని, జోనల్ అధికారి పరిధిలో అన్ని వైద్య సౌకర్యాలతో అంబులన్స్ లను అందుబాటు ఉంచుకోవాలని, ప్రజలు ఎవ్వరు లాక్ డౌన్ నిబంధనను ఉల్లంగించకుండా చూడాలని, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని దాతలు ముందుకు వస్తే పోలీస్ లేదా జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించాలని ముందస్తు అనుమతి తీసుకోవాలని అన్నారు.
సమావేశంలో కమిషనర్ లోకేషకుమార్ తో పాటు జోనల్ అధికారులు పాల్గొన్నారు.

More Press Releases