ప్రభుత్వం చేస్తున్న కృషికి దాతలు కూడా తోడవ్వాలి: తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్
- వలసకూలీలకు నిత్యావసరాలు
- దాతలు మరింతగా ముందుకు రావాలి
- లాక్ డౌన్ కు సహకరించాలి... సామాజిక దూరం పాటించాలి
- కరోనా లక్షణాలున్నట్లు అనుమానమొస్తే పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి
- మహబూబాబాద్ లో వలసకూలీలకు నిత్యావసరాల పంపిణీలో తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్
రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో రేషన్ కార్డున్న నిరుపేదలకు 12 కిలోల రేషన్, 1500 రూపాయలు ఇస్తుంటే...రేషన్ కార్డు లేని నిరుపేదలకు 12 కిలోల రేషన్, 500 రూపాయలను ఇస్తోందని చెప్పారు. దీనికి తోడు అనేక మంది దాతలు కూడా నేడు ఆదుకునేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. నేడు మెప్మావాళ్లు కూడా మాస్క్ లు పంపిణీ చేసి ప్రజల భద్రతకు సహకరించడం అభినందనీయమన్నారు.
లాక్ డౌన్ మే నెల 3వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో అందరూ సామాజిక దూరం, పరిశుభ్రత పాటిస్తూ ఇళ్లలోనే ఉంటూ సహకరించాలని కోరారు. ఈరోజు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలకు వీలైనంత సాయం చేయాలని మహబూబాబాద్ మహిళా నాయకులు కిట్టి పార్టీ చేసుకోవడానికి బదులు సిరి రేషన్ కార్డు లేని వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినందుకు అభినందిస్తున్నాను. ఇలాగే ఇంకా దాతలు ముందుకు రావాలి.