కేంద్ర వైద్య శాఖ సహాయమంత్రితో ఫోన్ లో మాట్లాడిన తెలంగాణ మంత్రి ఈటల
కేంద్ర వైద్య శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే తో ఫోన్ లో మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్:
మూడు విజ్ఞప్తులు చేసిన మంత్రి:
- 1000 వెంటిలేటర్స్ కోసం అడిగాం ఇంకా రాలేదు అని వెంటనే అందజేయాలని కోరారు.
- TIMS 1500 పడకల ఆసుపత్రి ప్రారంభం అయ్యింది కాబట్టి వీటి అవసరం ఉందని తెలిపిన మంత్రి.
- PPE కిట్స్, N -95 మాస్క్ లు HCL నుండి అందిస్తామని కేంద్రం తెలిపింది.. కానీ తగినంత రావడం లేదు వెంటనే చొరవ తీసుకోవాలని ఎక్కువ మొత్తంలో అందజేయాలని విజ్ఞప్తి చేసిన మంత్రి.
- రాష్ట్ర ప్రభుత్వం PPE కిట్స్, N-95 మాస్క్ లు పెద్ద ఎత్తున సేకరిస్తుంది కానీ ఎక్కువ ధరకు కొనవలసి వస్తుంది, అదే కేంద్రం అందిస్తే రాష్ట్రం పై భారం తగ్గుతుంది తెలిపిన మంత్రి.