కరోనా పట్ల భయం వద్దు.. అజాగ్రత్త వద్దు: హరీశ్ రావు
- జాగ్రత్తలు, పౌష్టకాహారంతో కరోనాను ఎదుర్కోవచ్చు
- మాస్క్ లేకుండా బయటకు రావద్దు. శుభ్రత పాటించండి
- మున్సిపల్ సిబ్బందికి శానిటైజర్స్ పంపిణీ
- మెదక్ జిల్లా చిన్న శంకరం పేటలోని ఓ ఫంక్షన్ హాలులో ఆర్థిక మంత్రి హరీశ్ రావు
హరీశ్ రావు కామెంట్స్:
- శానిటైజర్స్ ఇస్తున్నారంటే మున్సిపల్ సిబ్బంది బాగుగా ఉండాలన్న ఆలోచన
- మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలి
- కరోనా విషయంలో జాగ్రత్త ఉండాలి. మీరు ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి
- కరోనాకు ఉపాయాలు ఉన్నాయి
- మాస్క్ లేకుండా బయటకు రావద్దు
- సబ్బుతో రోజుకు నాలుగైదు సార్లు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి
- బయట నుంచి ఇంటికి వచ్చాక బట్టలు మార్చుకోవాలి, స్నానం చేసి వేరే దుస్తులు ధరించాలి
- కరోనా వైరస్ నుంచి బయట పడాలంటే... రోజుకు మూడు సార్లు వేడి నీళ్లు తాగండి. ఫ్రిజ్ నీళ్లు తాగవద్దు
- జలుబు అయితే ముఖానికి ఆవిరిపట్టండి. పసుపు నీళ్లతో ఆవిరి పట్టండి
- ప్రోటీన్ ఆహారం తీసుకోవాలి, కోడి గుడ్లు, పాలు వంటి ఆహారం తీసుకోవాలి
- సిట్రస్ ఉన్న నిమ్మ, సంత్రా, బత్తాయి వంటి పండ్లు తీసుకోండి. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
- కరోనా పట్ల భయం వద్దు, అలక్ష్యం వద్దు. జాగ్రత్తలు తీసుకోండి
- మనల్ని మనం కాపాడుకుంటూ సమాాజాన్ని కాపాడుదాం
- పారిశుధ్య పనులు పట్టణాల్లో, పంచాయతీల్లో ఆగకూడదని ప్రభుత్వం పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కింద నిధులు విడుదల చేస్తోంది. కరోనా వచ్చినా ఈ నిధులు ఆపలేదు