నిర్మాణరంగంలో కార్మికుల కొరతను పూడ్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి: తెలంగాణ మంత్రి వేముల
- ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మాణరంగంలో కార్మికుల కొరతను పూడ్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి
- రాష్ట్రంలోని యువతకు NAC ద్వారా శిక్షణ ఇచ్చి నిర్మాణ రంగంలో ఉపయోగించుకోవాలి
- లాక్ డౌన్ తదనాంతరం నిర్మాణ రంగం పుంజుకోవడానికి NAC(న్యాక్)డిజి మరికొంత మంది నిపుణులతో ఎక్స్ పర్ట్ కమిటీ ఏర్పాటు చేయాలి
ఈ పరిస్థితుల్లో నిర్మాణ రంగంలో ఏర్పడబోయే కార్మికుల కొరత, మెటీరియల్ లభ్యతపై ఈ సందర్భంగా చర్చించారు. గల్ఫ్ దేశాలు, ముంబాయి తదితర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి తిరిగివచ్చే కార్మికులతో నిర్మాణరంగంలో కార్మికుల కొరతను పూడ్చు కోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు NAC(న్యాక్) ద్వారా పెద్ద సంఖ్యలో ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించి వారిని కూడా నిర్మాణ రంగంలో ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. NAC డిజి తో పాటు డైరెక్టర్ ట్రైనింగ్స్, నిర్మాణ రంగం సంస్థల నుంచి కొంతమందితో కలిపి ఒక ఎక్స్ పర్ట్ కమిటీని వేయాలని నిర్ణయించారు.
ఈ కమిటీ కోవిడ్-19 తదనంతర పరిణామాలపై విస్తృతంగా అధ్యయనం చేసి నిర్మాణ రంగం మళ్లీ పుంజుకోవడానికి కావాల్సిన సూచనలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ కి సమర్పించేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, NAC(న్యాక్)డిజి భిక్షపతి, వివిధ నిర్మాణ రంగ సంస్థల ఆర్గనైజేషన్లు అయిన క్రెడాయ్, ట్రెడా, బిఎఐ, బిఎఫ్టి ప్రతినిధులు పాల్గొన్నారు.