నిబంధనలు సడలించడం అంటే కరోనా పోయినట్లు కాదు: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి
కరోనా వైరస్ నిరోదానికి ఉపయోగించే మూడువేల లీటర్ల శానిటైజర్ తో పాటు మూడు వేల మాస్క్ లను ఖమ్మం లోక్ సభ సభ్యులు నామా నాగేశ్వరరావు సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి అందించారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నామా నాగేశ్వర్ రావుతో పాటు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్:
- వ్యాక్సిన్ వచ్చేంత వరకు అప్రమత్తంగా ఉండాలి
- లాక్ డౌన్ నిబంధనలు నిత్య జీవితంలోనూ అలవర్చుకోవాలి
- శాని టైజర్ల వినియోగంతో పాటు విదిగా మాస్కులు ధరించాలి
- విపత్తు సమయంలో దాతృత్వం ధైర్యాన్ని ఇస్తుంది
- అటువంటి దాతృత్వాన్ని చాటుకున్న నేత నామ
- కరోనా వైరస్ లోను దాతల దాతృత్వం శ్లాఘనీయం
- ప్రభుత్వం పోలేని చోటకు స్వచ్చంద సంస్థలు వెళ్లడం అభినందనీయం
- ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో ప్రజలు భాగస్వామ్యం ఉంది
- తీవ్రతను ప్రజలు గుర్తించినందునే కరోనా కట్టడి
- ఏ ఒక్కరూ పస్తులు ఉండొద్దనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం
- ఇతర రాష్ట్రాల వారికీ ఆదరణ
- 12 కిలోల బియ్యంతో పాటు 500 నగదు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దీ