పిటిషన్ తయారీపై అధికారులతో తెలంగాణ మంత్రి సత్యవతి సమీక్ష
- సుప్రీం కోర్టు ఆధారాల పరిశీలన
- పిటిషన్ వేయడానికి నివేదికపై కసరత్తు
- న్యాయ సలహాలపై సమీక్ష చేసిన తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
రాష్ట్రంలోని గిరిజనులు హక్కులను కాపాడేందుకు సమగ్రమైన పిటిషన్ దాఖలు చేయాలని, దీని కోసం న్యాయ నిపుణుల సలహాలు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదుల సలహాలు స్వీకరించాలని, ఇందుకోసం కావల్సిన నివేదికలు, సమాచారాన్ని సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
త్వరలోనే గిరిజన ప్రజా ప్రతినిధులు, నిపుణుల సలహాలు తీసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం సుప్రీం కోర్టులో ఇచ్చిన తీర్పులోని అంశాలను, మనం పిటిషన్ వేయడానికి బలమైన కారణాలతో సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు.