సంక్షోభ వేళ, 90 కోట్ల రూపాయల విలువైన దయ
కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో ప్రపంచం సతమతమవుతుంటే, ఆశావాహ థృక్పథంతో ముందుకు సాగిపోవడం ఎన్నడూ సాధ్యం కాదు. అయినప్పటికీ ఈ కష్టకాలంలో కూడా కరుణ, సానుభూతి అనేవి ఇచ్చేవారి వ్యక్తిగత శ్రేయస్సుపై పూర్తిగా ఆధారపడవని ప్రజలు నిరూపిస్తున్నారు.
దక్షిణాసియాలో అతిపెద్ద ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ వేదిక అయిన మిలాప్, తమ వేదికను మార్చి 22,2020 వ తేదీన కోవిడ్ సంబంధిత అవసరాల కోసం తెరిచింది. ఒక నెలలోనే, వేలాది మంది వ్యక్తులు సంయుక్తంగా దాదాపు 90 కోట్ల రూపాయలను విరాళాలుగా అందించారు. ఈ ఆన్లైన్ ఫండింగ్ క్యాంపెయిన్ ను కేవలం పలు ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలసకార్మికులు, రోజువారీ కూలీలకు నిత్యావసరాలు మరియు కమ్యూనిటీ కిచెన్ల ద్వారా ఆహారాన్ని అందించడానికి మాత్రమే కాకుండా, ట్రాన్స్ జెండర్స్, మేల్ సెక్స్ వర్కర్లు, సర్కస్ ఆర్టిస్ట్‌లు, డ్రైవర్లు, డెలివరీ పర్సన్స్, గ్రామీణ కళాకారులు, డ్యాన్సర్లు, ఫ్రీలాన్స్ వర్కర్లు వంటి కమ్యూనిటీలకు సైతం సహాయం అందించడానికి నిర్వహిస్తున్నారు.
మిలాప్ కో ఫౌండర్, అధ్యక్షుడు -అనోజ్ విశ్వనాథన్ మాట్లాడుతూ " చెన్నై, అస్సామ్, కేరళలలో వరదలు వంటి ప్రకృతి సహజ విపత్తులు సంభవించిన సమయంలో సైతం క్రౌడ్ ఫండింగ్ ప్రజలను ఏకం చేయడంతో పాటుగా తీవ్రంగా ప్రభావితమైన ప్రజలు తమ జీవితాలను పునర్నిర్మించుకోవడానికి సహాయపడింది. ప్రతి ఒక్కరి జీవితమూ ఏదో ఒక రూపంలో ప్రభావితమవుతున్న ఈ కష్టకాలంలో ఇది ఓ ఆశాకిరణంగా నిలుస్తుంది. గడిచిన ఒక నెల కాలంలో, మేము ఐదు రెట్లకు పైగా అధికంగా వినియోగదారుల ప్రశ్నలను చూడటంతో పాటుగా ఫండ్ రైజర్స్ పరంగా 65% వృద్ధిని చూస్తున్నాం. ఇది మాకు పూర్తిగా సరికొత్త, కానీ ఇప్పుడు, గతానికన్నా మిన్నగా, ఎలాంటి క్లిష్టత లేని వినియోగదారుల అనుభవాలకు భరోసా అందించాలనుకుంటున్నాం. అందువల్లనే, మేము తక్షణమే ఈ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేకంగా ఓ బృందాన్ని నియమించడంతో పాటుగా అన్ని కోవిడ్-19 సంబంధిత కార్యక్రమాలకు మా ప్లాట్‌ఫామ్ రుసుమును పూర్తిగా రద్దు చేశాం. తద్వారా తమ వద్దకువచ్చిన సహాయాన్ని పూర్తిగా ప్రజలు ఆస్వాదించే అవకాశం కల్పించాము'' అని అన్నారు.
ఈ నిధుల సమీకరణ ప్రాధమిక నేపథ్యం తీవ్రంగా ప్రభావితమైన ప్రజలు అంటే రోజు సంపాదన పై ఆధారపడిన కూలీలు, వలస కార్మికులకు ఆహారం, భోజనం, సరుకులను అందించడంతో పాటుగా అనుసరించి హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వైద్య, వ్యక్తిగత రక్షణ ఉపకరణాలను అందించడం. ఇక మూడోది ప్రత్యేకంగా ప్రభావితమయ్యే ప్రజలు. చెన్నైకు చెందిన ట్రాన్స్ కమ్యూనిటీ తొలుత కనీసం100 మందికి చేరువ కావాలనుకుంటూ ఓ ఫండ్ రైజర్‌ను ప్రారంభించింది. కానీ అనూహ్య స్పందన లభించడంతో అదనంగా మరో 200 మంది ప్రభావితమైన ట్రాన్స్ పీపుల్‌కు మద్దతునందించారు. అదే రీతిలో, హైదరాబాద్‌కు చెందిన 11 సంవత్సరాల బాలిక రిధి, ప్రపంచ వ్యాప్తంగా దాతల నుంచి సహాయం పొందింది. ఈ ఆరవ తరగతి విద్యార్థి 7.48 లక్షల రూపాయలను సేకరించడంతో పాటుగా 1250 రేషన్ కిట్స్‌ను దినసరి కూలీలకు అందించింది. రాబోయే రోజుల్లో మరో 500 కిట్లను పంపిణీ చేయడానికి ప్రణాళిక చేసింది.
ఇతరులలో, కోరో మరియు సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ ఛైర్మన్ ల్యుయిస్ మిరందా కూడా మిలాప్‌పై ఓ ఫండ్ రైజర్‌ను ఆరంభించారు. దినసరి కూలీలకు నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు ఈయన ఫండ్ రైజర్ ప్రారంభించారు. ఇప్పటి వరకూ, ఆయన తాను సేకరించాలనుకున్న 1.3 కోట్ల రూపాయలలో 70% సమీకరించడంతో పాటుగా వేలాది మంది కూలీలకు సహాయపడ్డారు. తన ఫండ్ రైజింగ్ అనుభవాలను గురించి ల్యుయిస్ మాట్లాడుతూ "మిలాప్ అత్యున్నత భాగస్వామి. కోవిడ్-19 చేత ప్రభావితమైన దినసరి కూలీలకు సహాయ పడటానికి క్రౌడ్ ఫండింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుని మిలాప్‌ను సంప్రదించిన వెంటనే తమ ప్లాట్‌ఫామ్‌ను ఎలాంటి ఫీజులు చెల్లించకుండా వినియోగించుకోవడానికి అంగీకరించింది. ఏదైనా ప్లాట్‌ఫామ్‌పై నిధులను సమీకరించడం నాకు ఇదే తొలిసారి. ఈ ప్లాట్‌ఫామ్‌పై చేరడం చాలా సులభం. మా అభ్యర్థనలకు ఈ బృందం చాలా వేగంగా స్పందించింది. దాతల నుంచి కూడా వచ్చిన స్పందన అపూర్వం. మిలాప్‌పై మేము వెళ్లడం పట్ల చాలా ఆనందంగా ఉన్నాం'' అని అన్నారు.
ఆఖరకు అత్యంత ప్రాచుర్యం పొందిన యాగ్రిగేటర్లు సైతం ముందుకు రావడంతో పాటుగా అత్యంత తీవ్రంగా ప్రభావితమైన తమ ఉద్యోగులు ః డెలివరీ పర్సనల్ మరియు డ్రైవర్లకు మద్దతునందించారు.
మయూఖ్ చౌదరి, సీఈవో, మిలాప్ మాట్లాడుతూ "రేపు ఏమవుతుందనేది ప్రతి ఒక్కరికీ ఆందోళనగానే ఉంది. నేటి సమస్యలు కొంతమందికి తీవ్రంగా ఉంటే మరికొంత మందికి ఆ ప్రభావం తక్కువగా ఉండవచ్చని మనం ఇప్పటికీఅంగీకరిస్తుంటాం. అత్యంత కీలకమైన అవసరాల కోసం లాబీయింగ్ చేసిన 3వేలకు పైగా గుర్తింపు పొందని హీరోలకు మేము ధన్యవాదములు తెలుపుతున్నాం. అలాగే 1.6 లక్షలకు పైగా సహృదయులైన దాతలకు సైతం ధన్యవాదములు తెలుపుతున్నాం. వారు ముందుకు రావడంతో పాటుగా ఈ కష్టకాలంలో కూడా ఎవరూ మరిచిపోలేనట్టి ఆశను రేకిత్తించారు. ఈ క్యాంపెయిన్ ఆర్గనైజర్లలో కొంతమంది ఇప్పటికే 50 లక్షల మీల్స్‌ను తాము ఆన్లైన్లో దాతలు, ప్రభుత్వం, అధికారుల నుంచి అందుకున్న మద్దతు సహాయంతో అందించగలిగారు. ఈ కార్యక్రమాలకు స్పందన అపూర్వంగా లభించింది. ఈ కార్యక్రమాలకు తోడ్పాటునందించిన వారు అసలైన హీరోలు. ఎప్పటిలాగానే, ప్రజలను ఒకరితో ఒకరని కనెక్ట్ చేయడానికి మేము అదనపు మైలు వెళ్లేందుకు ఎదురుచూస్తూనే ఉంటాం. మా తరువాత ప్రయత్నం, భారతదేశ వ్యాప్తంగా స్థానిక వ్యాపారులకు మా నూతన కార్యక్రమం, స్మాల్ బిజినెస్ రిలీఫ్ ఇనీషియేటివ్ ద్వారా సహాయపడటం'' అని అన్నారు.
చిన్న మరియు సూక్ష్మ వ్యాపారాలు ఎంతోమందికి జీవనరేఖలు. స్థిరత్వం మరియు ఉపాధి వంటి ఎన్నో క్లిష్టమైన అంశాలను ఇవి తరచుగా పరిష్కరిస్తుంటాయి. తమ కమ్యూనిటీల నుంచి మరియు ప్రపంచవ్యాప్తంగా సహృదయులైన ప్రజల మద్దతుతో వారు చిరు మొత్తాలను సమీకరించగలిగారు. వీటి ద్వారా వారు తమ జీవనోపాధిని పునః ప్రారంభించగలరు.
మయూఖ్ చౌదరి, సీఈవో, మిలాప్ మాట్లాడుతూ "గడిచిన దశాబ్దంగా, దాదాపు 1.5 లక్షల చిరు వ్యాపారులతో కూడిన నెట్‌వర్క్‌ను మిలాప్ నిర్మించగలిగింది. సాధారణ మూలధన జోక్యం ద్వారా మేము వారికి మద్దతునందించాం. సంక్షోభం కారణంగా ప్రభావితమైన చిరు మరియు సూక్ష్మ వ్యాపారాలకు అర్హత కలిగించేందుకు ఆ ప్లాట్‌ఫామ్‌ను విస్తరించాలని మేము కోరుకుంటున్నాం. మా భాగస్వామి ఇంట్యుట్ క్విక్ బుక్స్‌తో సన్నిహితంగా పనిచేయడంతో పాటుగా ఈ వ్యాపారాలకు చిరు మొత్తాలను సమీకరించుకునే అవకాశం కల్పిస్తూ, ఈ సంక్షోభం ముగిసిన వెంటనే తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించేందుకు సహాయపడుతున్నాం. రాబోయే వారాలలో అదనపు కంపెనీలు మరియు వ్యక్తుల నుంచి చెప్పుకోతగ్గ మొత్తాలను విరాళాలుగా పొందగలమని ఆశిస్తున్నాము. తద్వారా దేశవ్యాప్తంగా మరింతగా అవసరమైన సహాయాన్ని మరిన్ని వ్యాపార సంస్థలకు అందించనున్నాం'' అని అన్నారు.
కోవిడ్-19తో ప్రభావితమైన చిరు వ్యాపారాలకు మద్దతునందించే కార్యక్రమం స్మాల్ బిజినెస్ రిలీఫ్. ప్రజల సహాయంతో వీరు చిరు మొత్తాలను సమీకరించనున్నారు, మరీముఖ్యంగా ప్రస్తుత నిశ్చల స్థితిలో తాము సేవలనందిస్తున్న సమాజం నుంచి ఈ మొత్తాలను సేకరించనున్నారు.
ప్రజలు ఒకే దరికి రావడం ప్రమాదంగా భావిస్తున్న ప్రస్తుత కాలంలో, ఒక లక్ష మందికి పైగా ప్రజలు పలు విభిన్న కారణాల కోసం మిలాప్్ కి వచ్చారు. కోవిడ్-19తో పోరాడటానికి సహాయపడిన ఒక అత్యంత అరుదైన సంఘటనగా ఇది నిలుస్తుంది.