జీహెచ్ఎంసీ అధికారులతో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ సమావేశం

Related image

హైదరాబాద్, 7 మే 2020: కంటైన్మెంట్ జోన్ ను తొలగించినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా కోవిద్ -19 పాజిటివ్ కేసులు వచ్చిన ఇండ్లు, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మరికొన్ని రోజుల పాటు క్రిమి సంహారకాలను స్ప్రేయింగ్ చేయించాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ అధికారులకు సూచించారు.

గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమీషనర్ డిఎస్ లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతమొహంతి, అదనపు కమీషనర్ బి సంతోష్, జోనల్ కమీషనర్లు బి శ్రీనివాస్ రెడ్డి, వి మమత, ప్రావీణ్య, ఎన్ రవికిరణ్, ఉపేందర్ రెడ్డి, అశోక్ సామ్రాట్ లతో నిర్వహించిన సమావేశంలో కోవిద్-19 నియంత్రణకు కొనసాగించాల్సిన చర్యల గురించి చర్చించారు.

ప్రభుత్వం నుండి తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు నగరంలో భౌతిక దూరం నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని చెప్పారు. భౌతిక దూరం పాటించని పండ్ల మార్కెట్లు, రైతు బజార్లును మూసివేయాలని తెలిపారు. అదే సమయంలో ప్రజలకు కూరగాయలు ఇబ్బంది రాకుండా, మొబైల్ రైతు బజార్ వాహనాలు ఇంకొంత ముందుగా కాలనీలకు చేరుకునే విధంగా మానిటరింగ్ చేయాలని చెప్పారు.

More Press Releases