కరోనా కారణంగా చైనాలోని పరిశ్రమలు తెలంగాణకే రానున్నాయి: మంత్రి ఎర్రబెల్లి
- కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో ఉజ్వలంగా తెలంగాణ
- చైనా నుంచి హైదరాబాద్ కి తరలనున్న పరిశ్రమలు
- ఆ పరిశ్రమలను వరంగల్ లోనే పెట్టడానికి సుముఖంగా కేసీఆర్, కేటీఆర్
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరగనున్న మరిన్ని ఉపాధి, ఉద్యోగ అవకాశాలు
- వరంగల్ సర్వతోముఖాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు
- కరోనాతో మరికొంత కాలం సహచర్యం తప్పదు
- కరోనా తర్వాత... మన తెలంగాణకు మంచి భవిష్యత్తు
- అప్పటి దాకా లాక్ డౌన్ ని మరింత పకడ్బందీగా నిర్వహించాలి
- కరోనా కష్ట కాలంలో నిరుపేదలను ఆదుకోవాలి
- సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్నదాతకు అన్ని విధాలా మేలు
- ప్రజల యోగ క్షేమాలు, సంక్షేమాల కోసం పని చేస్తున్న కేసీఆర్ కి అండగా ఉందాం
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మనకే కాదు, మరో ఏడాది పాటు కరోనా వైరస్ కష్టాలు ప్రపంచం మొత్తానికి ఉండనున్నాయి. ఈ లోగా చైనా పరిశ్రమలు ఇండియాకే రావాలని నిర్ణయించాయి. ప్రధాని మోదీని ఆ పారిశ్రామికవేత్తలు సంప్రదించి, తమ పరిశ్రమలను తెలంగాణలోనే పెడతామని చెప్పాయని, ఇష్టం లేకున్నా, మోదీ ఆ పరిశ్రమలను తెలంగాణకు రావడానికి అంగీకరించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ప్రస్తుతం వరంగల్ జిల్లా కేంద్రానికి అవుటర్ రింగ్ రోడ్డు వస్తున్నది. మంచినీటి వసతి ఉంది. దేవాదుల, ఎస్సారెస్పీ, కాళేశ్వరం నీరు అందుతున్నది. ఇటు రైతాంగం బాగుపడుతున్నది. ఇక పరిశ్రమలు కూడా వస్తే, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు, ఉపాధి కూడా లభిస్తాయని మంత్రి చెప్పారు.
కరోనా వైరస్ విస్తరణ, పరిస్థితులను బట్టి లాక్ డౌన్ ఉంటుందని, లాక్ డౌన్ ని పకడ్బందీగా నిర్వహించి, మనమంతా ఆరోగ్యంగా ఉండాలన్నారు. అంతేగాక, ఈ సమయంలో నిరుపేదలను ఆదుకోవాలని, దాతలు, నేతలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.
స్థానికంగా అశోక్ రెడ్డి, శ్రీనివాస్ తదితరుల సహకారంతో అందచేసిన నిత్యావసర సరుకులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిరుపేదలకు పంపిణీ చేశారు.