కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ మంత్రి పువ్వాడ
ఇంతటి విపత్కర పరిస్దితుల్లో కూడ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, తెలంగాణలోని ప్రతీ పేదింటి వారికి సీఎం కేసీఆర్ కొండంత అండగా నిలుస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలోని ఖమ్మం అర్భన్, రఘునాధపాలెం మండలంలో కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన 47 చెక్కులను గాను 47 లక్షల రూపాయల విలువ గల చెక్కులను గురువారం VDO's కాలనీలోని మంత్రి క్యాంప్ కార్యాలయంనందు లబ్దిదారులకు ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపడుచుల వివాహాలు జరిపించి ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా తల్లిదండ్రులను ఆదుకోవాలనే సదుద్దేశంతో పాటు ప్రతి నిరుపేద ఆడపిల్ల సంతోషంగా పెళ్లి చేసుకునే విధంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా తెలంగాణ సర్కార్ పార్టీలు, రాజకీయాలకతీతంగా అర్హతను ప్రాతిపదికగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పేదింటి ఆడబిడ్డల కోసం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ ఆడపిల్లల తల్లులకు పెద్దన్నలాగా, పెళ్లి కూతుర్లలకు మేనమామాలా అదుకుంటున్నారని అన్నారు. ప్రతి ఇంట్లో సంతోషమే ధ్యేయంగా ఆడపిల్లల పెళ్లిళ్ల భాద్యతను ప్రభుత్వం తీసుకుంటూ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ వంటి బృహత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సుపరిపాలనకు నిదర్శనమని ఆయన కొనియాడారు.
తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పారు. వివాహాలు జరిపించిన యువతుల కుటుంబాలకు తొలినాళ్లలో రూ.51 వేలు అందించిన ప్రభుత్వం.. తర్వాత రూ. 75వేలు ఇచ్చిందన్నారు. అనంతరం ప్రస్తుతం ఈ పథకం ద్వారా లక్ష పదహారు రూపాయిలు అందిస్తున్నదంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు పేదలపై ఉన్నటువంటి ప్రేమ ఏమిటో తెలుస్తున్నదని తెలిపారు. పేదింటి కుటుంబం తన కుటుంబంలా అన్ని విధాలుగా అదుకుంటున్నారని అన్నారు.
గత పాలకులు దశాబ్దాలుగా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన ఘటనలనుండి నేడు రైతును దేశానికే ఆదర్శంగా నిలపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు నేడు ఫలించి వారిని ఉన్నత స్థితిలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కరోనా విపత్కర పరిషితుల్లో రైతులు పండించిన పంటలకు చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రభుత్వం ప్రకటించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడు లేని విధంగా పూర్తి స్థాయిలో ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేసిందని మంత్రి అన్నారు. అందుకు అనుసంధానంగా వివిధ ప్రాంతాల నుండి లారీల ద్వారా ధాన్యం తరలిస్తుండటంతో పాటు, ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా సరుకు రవాణాను చేస్తు సరుకు నిల్వలను చేయడం జరుగితుందన్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా కేంద్రం అల్లిపురం నుండి ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా సరుకు రవాణా కార్యక్రమాన్ని మంత్రి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
ఇప్పటికే జిల్లాలో దాదాపు సేకరణ పూర్తి అయిందని, మరి కొన్ని చోట్ల కొనుగోలు కొనసాగుతుందన్నారు. ఎక్కడ ఎలాంటి రవాణా ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహం ఏ రాష్ట్రంలోనూ లేదని, ప్రభుత్వ సూచనల ప్రకారం రైతుల నుండి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు జరుగుతుందన్నారు. తెలంగాణలో ప్రజల ఆహార వినియోగంపై ప్రభుత్వం సంపూర్ణ సర్వే నిర్వహించిందని, దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా ఎదిగిన విషయం గుర్తు చేశారు. తెలంగాణలో వినియోగంతో పాటు దేశంలో, ప్రపంచంలో డిమాండ్ ఉన్న పంటల సాగుకు చేసేందుకు రైతులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు పంటను అమ్ముకునేందుకు కష్టపడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని, తాను పండించిన పంటకు తానే ధర నిర్ణయించే స్థితికి తేవాలన్నదే ప్రభుత్వం అభిమతమన్నారు.
కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS, అదనపు కలెక్టర్ మధుసూదన్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర రావు, మార్కుఫెడ్ వైస్ చైర్మన్ రాజశేఖర్, వ్యవసాయ శాఖ ఏడిఏ శ్రీనివాస్ నాయక్ తదితరులు ఉన్నారు.