'బహిరంగ మల విసర్జన రహిత జిల్లా'గా సూర్యాపేట
- సూర్యపేట జిల్లా కేంద్రం
హరితహారం విజయవంతం చేయడంలో గ్రామ కార్యదర్శుల సింహ భాగంలో ఉండాలని ఆయన కోరారు. 2014 కు పూర్వము చెట్ల పెంపకం అనేది కాగితాలతో సరిపెట్టారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతకాలం అంకెల గారడితో జరిగిన మోసాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం లో నిర్దేశించిన ప్రతి మొక్క భూమి మీద నాటేలా చర్యలు చేపట్టారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. చెట్ల నాటడం అనేది ప్రజల భాగస్వామ్యం తో ఒక ఉద్యమం లా కొనసాగిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.హరితహారం మొదలు పెట్టకముందు కాగితాల మీదనే అడవులు సృష్టించిన అంశాన్ని గణాంక వివరాలతో ఆయన బయట పెట్టారు.అతి తక్కువ అటవీ ప్రాంతం ఉన్న జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా అని అందులో సూర్యపేట జిల్లా చెట్ల పెంపకంలో మరింత వెనకబడి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి సూర్యపేట జిల్లా 12 వేల హెక్టార్ల భువిస్తీర్ణాలో 33% భూమి అటవీ ప్రాంతంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అటువంటిది లెక్కల్లో కేవలం 2.4%మాత్రమే అటవీ ప్రాంతం ఉన్నట్లు లెక్కల్లో చూపుతున్నారు అంటే చెట్ల పెంపకం లో మనం ఎక్కడ ఉన్నామో ఒక్కసారి అవలోకనం చేసుకోవాలని ఆయన ఉపదేశించారు.ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావడంతో అడవుల్లో ఉండే కోతులు జనావాసాలకు వస్తున్న అంశాన్ని విస్మరించరాదని ఆయన కోరారు.కేవలం ప్రభుత్వ భూములలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ తమ వ్యవసాయ భూములలో కూడా విరివిగా మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకు భిన్నంగా వ్యహరిస్తే 2070 నాటికీబారతదేశ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందన్న దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలు ఇక్కడ ప్రస్తవానర్హమేనంటూ ఆయన ఉపదేశించారు. నాలుగు దశాబ్దాల క్రితం మంచినీళ్లు కొనుక్కొని తాగుతామని ఏ ఒక్కరూ ఊహించలేదని అటువంటి దుర్బర పరిస్థితి ఏర్పడడానికి మానవ తప్పిదమే కారణమని ఆయన చెప్పారు.
కాకతాళియంగా చెబుతున్న విషయం కాదు మంచి నీళ్ళు కొన్నది మొదటి సూర్యపేట పట్టణం నుండే మొదలైందని,నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా ఇక్కడి నుండే అంకురార్పణ జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్ లో ఆక్సిజన్ కొనుగోలు /అమ్మకాలు కూడ ఇక్కడి నుండే మొదలవుతుందా అన్న సందేహం వెంటాడుతుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్:
- గణాంకాలతో గారడి
- అడవుల పెంపకం కాగితాలతో సరి
- ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఉద్యమంలా హరితహారం
- అబ్దుల్ కలాం మాటలు ప్రతి ఒక్కరూ పరిగణనలోకి తీసుకోవాలి
- మొట్ట మొదటిసారిగా మంచినీళ్లు కొనుక్కున్నది సూర్యపేట లోనే
- నీటిశుద్ది కేంద్రం మొదలైంది ఇక్కడి నుండే
- భవిష్యత్ ను అంధకారంలో కి నెట్టకండి
- ఆక్సిజన్ ను కొనుగోలు చేసే పరిస్థితులు ఉత్పన్నం కానివ్వద్దు
- హరితహారం సమీక్షా సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి