ఏపీ ఉపముఖ్యమంత్రి పాముల, మంత్రి ధర్మాన కనబడుటలేదు.. సందేహం వ్యక్తం చేసిన మేడా శ్రీనివాస్!
ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీ వాణి (విజయనగరం), ఏపీ ఆర్ & బి శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ (శ్రీకాకుళం) వీరు ఇరువురు గత కాలంగా ఆ జిల్లాలలో గాని, రాష్ట్ర పాలనలో గాని పెద్దగా కనబడటం లేదని మేడా శ్రీనివాస్ సందేహం వ్యక్త పరిచారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులను పరామర్శించటానికి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో పూర్తిగా గైరుహాజరు అయ్యారని, నేటి వరకు వీరు గ్యాస్ లీక్ బాధితులను కూడా పరామర్శించిన దాఖలాలు లేవు, మంత్రులు కన్నబాబు, బొత్స, అవంతిలతో పాటు విజయసాయి రెడ్డి మాత్రమే కనబడుతున్నారని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి సైతం వీరికే ఆ భాద్యతలు అప్పగించటం అనేక అనుమానాలకు తావు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. కరోనా సేవలలో కూడా కనబడటంలో గైరుహాజరు అయితున్నారని, వైద్య శాఖ మంత్రి నిర్వహించిన మీటింగ్ లో మాత్రం ఒకేసారి తళుక్ మని మెరిసి మాయమై పోయారని ఆయన గుర్తు చేశారు. జగన్ సర్కార్ పై ప్రజలలో ప్రభ తగ్గుతుందనే కారణంతో ముందు జాగ్రత్తగా జగన్ పార్టీకి దూరంగా ఉంటున్నారా ! వైసీపీ పార్టీకి దూరమయ్యే ఆలోచనలో ఉన్నారా !! అనేది మంత్రులు వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.
అంతకుముందు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి ఏదో ఒక సందర్బంలోనైనా కనబడేవారని విశాఖపట్నంలో అంత బారి ప్రమాదం జరిగితే ఆ ప్రాంత ప్రతినిధిగా బాధితులను పరామర్శించటానికి రాకపోవటంపై విశాఖ ప్రజలు గుర్రు మంటున్నారని ఆయన విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పాముల, మంత్రి ధర్మాన జగన్ వెంటే వున్నాము. వైసీపీ పార్టీలోనే వున్నాము అని అజ్ఞాతం విడిచి ఒక ప్రకటన చేయక పొతే సొంత పార్టీ వారికి, ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయని ఆయన వాపోయారు.
ఈ మంత్రులు గైరుహాజరుతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రజలు గుసగుసలు నిజమనిపిసున్నాయని, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ప్రజలు ముందుకొచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నా మంత్రుల మౌనం వెనుక ఆంతర్యం తెలియుటలేదని ఆయన అనుమానం వ్యక్త పరిచారు.