కేంద్ర ఉద్దీపన ప్యాకేజీతో గిరిజనులకు ప్రయోజనం లేదు: తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్
- గిరిజనులకు నేరుగా లబ్ది కలిగేలా చర్యలు లేవు
- గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చే చర్యలు చేపట్టాలి
- గిరిజన ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ పటిష్టతకు నిధులు కేటాయించాలి
- సిఎం కేసిఆర్ నాయకత్వంలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు
- కేంద్ర మంత్రి అర్జున్ ముండాతో తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్
ఈ సందర్భంగా కేంద్ర ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీపై రాష్ట్రంలో ఏమనుకుంటున్నారంటూ ఆరా తీశారు. దీనిపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందిస్తూ…కేంద్ర ఉద్దీపన ప్యాకేజీపై రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ప్రయోజనమేమి లేదని తెలిపారు.
ముఖ్యంగా ఈ 20 లక్షల కోట్ల రూపాయలలో గిరిజనులకు నేరుగా లబ్ది చేకూరేదేమి లేదన్నారు. కరోనా వైరస్ ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చేందుకు, రవాణా వసతి పటిష్ట పర్చాలని కోరారు.
కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి అర్జున్ ముండాకు వివరించారు. గిరిజన ప్రాంతాలలో కరోనా వైరస్ తాకిడి లేదని, అదేసమయంలో లాక్ డౌన్ సందర్భంగా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.