అమ్మకానికి ఆంధ్రప్రదేశ్.. మేడా శ్రీనివాస్ ఎద్దేవా!
- అమ్మకానికి ఆంధ్రప్రదేశ్.. మేడా శ్రీనివాస్ ఎద్దేవా, అర్పిసి
ఒకే ఒక్క అధికారాన్ని అనుభవించాలనే అత్యాశతో ఏపీ భవిష్యత్ ను నిర్వీర్యం చేయరాదని, గత పాలకులకు భిన్నంగా ఆదర్శవంతమైన పాలనతో జగన్ ప్రజల మెప్పు పొందుతారని ప్రజలు ఆశిస్తే అందుకు భిన్నంగా అపకీర్తిని మూటకట్టుకుంటున్నారని ఆయన ఆరోపణ చేశారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి యావత్ భారతదేశం గర్వపడే విధంగా జగన్ అభివృద్ధి ని సాధించి చూపాలని, ఈ రోజు ప్రభుత్వ భూములు అమ్ముకుంటే రాను రాను ప్రభుత్వ కార్యాలయాలు, భవంతులు, ఫర్నిచర్ లు అమ్ముకోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన చెందారు.
పాలన ఇదే తరహాలో వుంటే ఉపాధి అవకాశాలు, ఆదాయ మార్గాలు కొరవడి ఏపీలో కరువు తాండవిస్తుంది. అన్నపూర్ణగా పిలవబడే ఆంధ్రప్రదేశ్ బిక్షాటన ఆంధ్రప్రదేశ్ గా మారే ప్రమాదం వుందని ఆయన తీవ్ర ఆవేదన చెందారు.
పాలకులకు ముందస్తు వ్యూహం, రాబోయే పరిణామాలు పై అవగాహన కలిగి వుండాలని, విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన హైదరాబాద్ లోగల ఒక లక్ష కోట్లు పైబడిన ఆస్తులను రాబెట్టడం పై దృష్టి సారిస్తే నేడు ఏపీలో గల ప్రభుత్వ భూములను అమ్ముకోవాల్సిన అవసరం ఏర్పడేది కాదని ఆయన గుర్తు చేశారు.
అన్ని వసతులు, సౌకర్యాలు, ఆదాయ మార్గాలు గల ఆంధ్రప్రదేశ్ లో పాలకుల రాజకీయ వ్యాపారం కారణంగా ప్రజల నెత్తిపై మోయ లేని పేదరికం తాండవిస్తుందని, ఆ పేదరికాన్ని పాలకులు ముడిసరుకు వలే మార్చుకుంటు ఏపీ భవిష్యత్ ను కృంగదీస్తు అధికారాన్ని సాశిస్తున్నారని ఆయన తీవ్ర మనస్తాపం చెందారు.
ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కోస్తా, ఉత్తరాంధ్రాలో కులాల వారిగాను, రాయలసీమ జిల్లాలను మతాలు గాను, ముఠాలు గాను రూథర్ ఫర్డ్ పాలనను తలపిస్తు ఏపీలో అశాంతి ని, దోపిడీని ప్రోత్సహితున్నారని,ఈ కారణంగా అభివృద్ధి పై, భద్రత పై అవగాహన వున్న పాలకులను ప్రజలు ఎన్నుకోలేక పోతున్నారని ఆయన విస్తుపోయారు.
ప్రధాన ప్రతిపక్షం, కొన్ని ప్రధాన రాజకీయ పార్టీల మోనం ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సుకు మంచి పరిణామాలు కావని, ఒక ఉమ్మడి ప్రజా కార్యాచరణ ద్వారా ప్రభుత్వ భూముల విక్రయాలను అడ్డుకోవాలని, ఏపీ అభివృద్ధి పై దృష్టి సారించే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని, ఆగిన రాజధాని పనులపై ప్రభుత్వం దృష్టి సారించే విధంగా ఉమ్మడి ప్రణాళిక ద్వారా ప్రజల ను సమాయత్త పరచాలని ఆయన తెలిపారు.
సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం ద్వారా రాష్ట్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుని అభివృద్ధి పరుచుకోవాలని, ప్రభుత్వ భూముల విక్రయాలను ఆపే విధంగా కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం వుందని , హైదరాబాద్ లో గల విభజన చట్టం ప్రకారం మన వాటాను రాబట్టుకోవాలని ఆయన కోరారు.
అభివృద్ధి కి, భద్రతకు వ్యతిరేకంగా పాలన సాగించే పాలకులను ఇంటికి సాగనంపాలని, ఏపీని అన్ని రంగాలలోను కాపాడు కోవటానికి, అభివృద్ధి పరచు కోవటానికి, భావితరాల భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వేధికను ప్రజలే సిద్ద పరుచుకోవాలని, ఒకే ఒక్క మార్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఖండాన్తరాలుగా చాటాలని యువతకు అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపు నిచ్చారు.