వ్యవసాయ శాఖకు కొత్త గైడ్ లైన్స్: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి
- లాభదాయక పంటలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి
- టిఆర్ఎస్ పాలనలో రైతే రాజు
- మూస ధోరణిలో సాగుకు స్వస్తి పలకాలి
- బౌతిక దూరం పాటిస్తూ.. అభివృద్ధి పనులలో పాల్గొంటూ మారుమూల తండాలలో సి.సి రోడ్లకు శంకుస్థాపన
- 15 కోట్ల అంచనా వ్యయంతో బి.టి రోడ్ల నిర్మాణాలు
- 90 రోజుల్లో రహదారుల నిర్మాణం పూర్తి చేయాలి
- అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలు
- సూర్యపేట నియోజకవర్గంలో మంత్రి సుడిగాలి పర్యటన
లక్ష్మి నాయక్ తండా, పాచ్యానాయక్ తండా, కోటపహాడ్, జి మల్కాపురంలతో పాటు కందగట్ల, దూరజ్ పల్లి, బాలెంల, ముక్కుదేవులపల్లి తదితర గ్రామాలలో మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో జరిగిన సభలలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ లాభదాయక పంటలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా రూపొందించిన గైడ్ లైన్స్ ను విదిగా పాటించాలని ఆయన రైతాంగానికి విజ్ణప్తి చేశారు.
ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ పంటలు వేస్తే రైతులకు లాబదయాకమనేది ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యయనం చేశారని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. రైతును రాజును చెయ్యడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. ఆ సంకల్పబలం చేకూరే విధంగా రైతాంగం వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. కరోనా మహమ్మరి ప్రబలడంతో అభివృద్ధి పనులకు కాసింత ఆటంకం ఏర్పడిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కనిపించని శత్రువుపై జరిగిన పోరాటంలో మనోధైర్యాన్ని సాదించమన్నారు. అలా అని కరోనాను ఆశ్రద్ద చేయడం తగదని ఆయన హితవు పలికారు. స్వీయ నియంత్రణ, భౌతిక దూరాలే కరోనాకు మందు అని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి వెంట రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్, జడ్పిటిసి బిక్షం, యంపిపి రవిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.