ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి
- సూర్యపేటలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా
- వినూత్న ప్రయోగంతో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం
- లాక్ డౌన్ వేళ రంజాన్ మాసంలో మంత్రి జగదీష్ రెడ్డి మార్క్
- సొంత నిధులతో ఐదు వేల ముస్లిం కుటుంబాలకు పంపిణీ
- ఇంటింటికి తిరుగుతూ... పేరు పేరునా పలకరిస్తూ దాత్రుత్వం చాటుకున్న మంత్రి జగదీష్ రెడ్డి
- డ్రై ఫ్రూట్స్ తో సహా 10 రకాల నిత్యావసర సరుకుల అందజేత
- లాక్ డౌన్ సమయాన ముస్లిం సోదరులకు బాసటగా మంత్రి రాకతో అంబరాన్ని అంటిన సంబురాలు
- పరవదినోత్సం రోజున ఇంటికి చేరిన తోఫా తో పరవశించిపోతున్నముస్లిం సోదరులు
- మంత్రి జగదీష్ రెడ్డికి ముస్లిం మతపెద్దల ఆశీర్వాదాలు
- ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తి తోటే - మంత్రి జగదీష్ రెడ్డి
శనివారం ఉదయం సూర్యపేట నియోజకవర్గ పరిధిలోని రాయినిగూడెం వద్ద మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ఆసాంతం ముస్లిం సోదరులకు మనోధైర్యాన్ని పెంపొందించేలా చేసింది. లాక్ డౌన్ వేళా చంద్రామానాన్ని అనుసరించి 9 వ నెలలో ముస్లింలు జరుపుకునే పరమ పవిత్రమైన రంజాన్ పండుగ రావడం తో ఆర్థిక వెసులుబాటు ఎలా అన్న సందిగ్ధంలో ఉన్న పేద ముస్లింలకు మంత్రి జగదీష్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆసరాగా నిలిచింది. కరోనా దెబ్బకు వృత్తి వ్యాపారాలు దెబ్బతిన్న పేద ముస్లింలు మంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
దివ్యఖురాన్ గ్రంధం ఆవిర్భవించిన మాసం లో క్రమశిక్షణ... దాత్రుత్వం... ధార్మిక చింతనల కలయిక తో ఏర్పడ్డ రంజాన్ పరవదినోత్సం రోజున ఏ ఒక్క ముస్లిం సోదరుడు నిరాశకు లోను కావొద్దు అన్నదే సంకల్పం అన్న మంత్రి జగదీష్ రెడ్డి ఆలోచనలకు ఈ తోఫా కార్యక్రమం ప్రతిబింబించింది. నిన్నటి దాకా రెడ్ జోన్ ఏరియగా ముద్రపడిన సూర్యపేట పట్టణంలో నివసిస్తున్న ముస్లిం సోదరులకు పర్వదినంగా భావించే రంజాన్ మాసంలో మానవీయ కోణంలో నిత్వావసర సరుకులు ఏర్పాటు చెయ్యడం అభినందనీయమని పలువురు ముస్లిం పెద్దలు కొనియాడుతున్నారు.
పండుగ ప్రాశస్త్యాన్ని కాపాడడం తో పాటు ఆర్ధికంగా ఏ ఒక్క పేద ముస్లింలు కుంగిపోకుండా ఉండేందుకు గాను వినూత్నమైన రీతిలో మంత్రి జగదీష్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ముస్లిం మత పెద్దలు స్వాగతిస్తున్నారు. పైగా మంత్రి జగదీష్ రెడ్డి నేరుగా గుమ్మం ముందటకు వచ్చి తోఫాను అందజేయ్యడం పట్ల పేద ముస్లిం సోదరులు ఆనందంతో పరవశించి పోతున్నారు.
మరో రెండు రోజులలో జరుపుకోనున్న రంజాన్ పర్వదినం సంబురాలు మంత్రి జగదీష్ రెడ్డి ఇంటింటికి తిరిగి డ్రై ఫ్రూట్స్ తో సహా 10 రకాల నిత్యావసర సరుకుల అందజేత తో ఈ ఉదయమే ప్రారంభమైనట్లుగా భావిస్తున్నామని ముస్లిం మత పెద్దలు స్వయంగా మంత్రి జగదీష్ రెడ్డి తో పేర్కొనడం సూర్యపేట లో శనివారం ఉదయం జరిగిన తోఫా పంపిణీ ప్రోగ్రాం లో హైలెట్ గా నిలిచింది.
తెలంగాణ గంగా, జమునా తహజీబ్: మంత్రి జగదీష్ రెడ్డి
ఇదిలా ఉండగా ఈ విషయమై మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలనలో సైతం అప్పటి హైదరాబాద్ రాష్ట్రం సర్వమత సమ్మేళనానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ సైతం ఈ విషయాన్ని అంగీకరించారని ఆయన తెలిపారు. అటువంటి రాష్ట్రంలో మతసామారస్యాన్ని కాపాడడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందే వేసిన చెయ్యి అని ఆయన కొనియాడారు. చంద్రామాన కేలండర్ ను అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెలలో రంజాన్ మసాన్ని పరమ పవిత్రమైన మాసంగా జరుపుకుంటారన్నారు.
అందుకు ప్రధాన కారణం ఇదే మాసంలో *దివ్య ఖురాన్* గ్రంధం అవిర్భవించడమేనని ఆయన పేర్కొన్నారు. క్రమ శిక్షణ.... దాత్రుత్వం... ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసమని ఆటువంటి పవిత్రమైన మాసంలో సంభవించిన పరిణామాలతో రంజాన్ పరవదినోత్సవ ప్రాశస్త్యాన్ని కాపాడుకోవడం తో పాటు... ఏ ఒక్కరు ఆర్ధికంగా కుంగి పోకుండా ఉండేందుకు గాను తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా సమయంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ తో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల స్ఫూర్తి తోటే రంజాన్ పరవదినోత్సం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.