పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణీ
రంజాన్ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఐదు వేల మంది పేద ముస్లిం కుటుంబాలకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమకూర్చిన కిట్స్ ను సతీమణి పువ్వాడ వసంతలక్ష్మితో కలిసి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారికి తోఫా రూపంలో పండుగ కానుక పంపిణీ చేశారు. గత నెల 19వ తేదీన తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి కరోనా కష్ట కాలంలో పేదలకు అండగా ఉండాలనే ఆకాంక్షతో కార్పొరేషన్ లోని 10వేల మంది పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
అనంతరం మే1వ తేదీ కార్మిక దినోత్సవం సందర్బంగా వివిధ రంగాల కార్మికులకు 5వేల నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణీ చేశారు. తాజాగా రానున్న రంజాన్ పండుగను అందరూ జరుపుకోవాలనే ఉద్దేశంతో నగరంలోని సొంత నిధులతో ఐదు వేల మందికి డ్రై ఫ్రూట్స్ తో సహా పది రకాల నిత్యవసర సరుకులు ప్రతి ముస్లిం కుటుంబానికి శనివారం వివిధ డివిజన్లలో సతీమణి పువ్వాడ వసంతలక్ష్మితో కలిసి పంపిణీ చేశారు. లాక్ డౌన్ వేళ దాతృత్వాన్ని చాటుకున్న విషయం తెలుసుకున్న ముస్లిం సోదరులు మంత్రి పువ్వాడకు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ మేరకు ఆయా డివిజన్లలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు.
ముస్లిం సోదరులకు పర్వదినంగా భావించే రంజాన్ మాసంలో మానవీయ కోణంలో నిత్వావసర సరుకులు ఏర్పాటు చెయ్యడం అభినందనీయమని పలువురు ముస్లిం పెద్దలు కొనియాడారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు ఉన్నారు.
రైతు బంధు సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి:
తెలంగాణలో వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి, వ్యవసాయ రంగం మరింత ప్రగతి సాధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తొలుత సమగ్ర పంటల విధానం అమలు చేస్తామని రైతుల చేత ప్రతిజ్ఞ చేయించారు. శనివారం వివి పాలెం, మంచుకొండ గ్రామం లో నిర్వహించిన రైతు బంధు సమావేశాలలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. భవిష్యత్తులో వ్యవసాయం పరిణితి సాధించడానికి ప్రభుత్వం దీర్ఘకాలిక చర్యలు చేపట్టిందని, రైతులు పండించిన పంట సంపూర్ణంగా అమ్ముడుపోయే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణలో పంటల సాగు జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారని అన్నారు. తెలంగాణలో వ్యవసాయ రూపురేఖలు మార్చే విధంగా ప్రజల అవసరాలు, మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా తెలంగాణలో జరగాల్సిన పంటల సాగుపై అనుసరించాల్సిన వ్యూహాలను రైతులకు ప్రభుత్వం అందిస్తుందన్నారు.
తెలంగాణ వ్యవసాయానికి ఒక దశ, దిశను నిర్దేశించాలని నిర్ణయించారు. ‘‘తెలంగాణ ఏర్పడినప్పుడు వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉండేదని, ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల కాస్త ఊరట లభించింది. ఇప్పుడిప్పుడే రైతాంగంలో నమ్మకం ఏర్పడుతుందని, వ్యవసాయంలో సంస్కరణల శకం ఈ ఏడాది వర్షాకాలం పంటతో ప్రారంభమవుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా రైతుల శ్రేయస్సు కోసమే చేస్తుందనే విశ్వాసం రైతుల్లో ఉందన్నారు. సాగునీరు ఉంది, పెట్టుబడి ఉంది.. ప్రభుత్వంపై నమ్మకం ఉంది. ఇన్ని సానుకూలతలున్న క్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన విధిగానే పంటలు వేసుకోవాలన్నారు. వ్యవసాయాభివృద్ధికి స్వల్ప కాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంభిచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికిప్పుడు అనుసరించాల్సిన వ్యూహంలో భాగంగా రైతులకు కావాల్సినవి సమకూర్చతుందని వివరించారు. దీనివల్ల పంటలు బాగా పండి ప్రతి రైతు తాను పండించిన పంటలను లాభసాటిగా అమ్ముకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. పండించిన పంటకు కనీస మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంతుంది. తెలంగాణ జీవికలో వ్యవసాయమే ప్రధానం కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కువ దృష్టి వ్యవసాయం మీదనే పెట్టారని అన్నారు. ప్రతీ ఏడాది పరిస్థితులు మారుతుంటాయి. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పంటలు మార్చుకుని వేసుకోవాలన్నది ప్రభుత్వ సూచన అని అన్నారు.
కంది, వారి, పత్తి పైనే దృష్టి పెట్టాలని రైతులను కోరారు. కంది ని ఈసారి ప్రభుత్వమే కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొంటుందన్నారు. ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తేనే రైతు బంధు వస్తుందని లేదంటే రాదనే అపోహలు వొద్దు అన్నారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండాలనే ముఖ్యమంత్రి అభిమతం అన్నారు. ప్రతికూల పంటలు వేసి రైతులు నష్టపోవొద్దని అన్నారు. కాబట్టి పంటల మార్పిడి విధానం రైతులకు అలవాటు కావాలని, పంటల మార్పిడి విధానం అవలంభించడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుందన్నారు. ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకంలో కూడా మార్పు రావాలని, ప్రస్తుతం రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల కేవలం వ్యాపారుల మాట నమ్మి వాటిని వాడుతున్నారని అన్నారు. రైతు బంధు వేదికల ద్వారా వారికి అవగాహన కల్పించి, వారిని చైతన్యవంతం చేయాలన్నారు.
తగిన మోతాదులో ఎరువులు, పెస్టిసైడ్స్ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు తెలపాలి. ఎరువులు ఎక్కువ వాడిన పంటకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండదనే విషయం కూడా వారికి అర్థమయ్యేట్లు వివరించాలన్నారు. అందుకే ప్రతి క్లస్టర్ లో రైతు బంధు వేదికలు నిర్వహించుకోవాలి. ఇది రాజకీయ సమావేశాలు కావు.. రైతు సమావేశాలు. మేము ప్రారంభిస్తాం మీరు పోర్టు చేసుకోవాలి అని సూచించారు. రైతు బంధువుల వేదిక సమావేశాల ద్వారా అనేక విషయాలు చర్చకి వచ్చి వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలు క్షుణ్ణంగా చర్చించి వాటి పరిష్కరనికి ఆస్కారం లభిస్తుందని అన్నారు. రఘునాధపాలెం మండలం ఆదర్శంగా ఉన్నామని మరింత ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఆశిస్తున్నా విదంగా పంట మార్పులకు శ్రీకారం చుట్టాలకి అన్నారు.
సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను పాలేరు జలాశయంలో పోసి ప్రతి ఎకరాకు నీరు అందించాలని ముఖ్యమంత్రి తగు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు క్లస్టర్ లో ఉన్న 5వేల ఎకరాలకు ప్రతి ఎకరా పై సమగ్రమైన పర్యవేక్షణ తీసుకుంటున్నారని అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎక్కడ రైతుకు ఇబ్బంది కలగకుండా చూశారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన దక్షత కు నిదర్శనమన్నారు...కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, రైతు బంధు జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర రావు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, AMC చైర్మన్ వెంకటరమణ, జిల్లా వ్యవసాయ అధికారి ఝాన్సీ లక్ష్మీ కుమారి, తదితరులు ఉన్నారు.