రైతు కన్నీరు తుడిచేందుకే నూతన సాగు విధానం: తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- తెలంగాణకు నిండైన ఆత్మ కేసీఆర్
- డిమాండ్ ఉన్న పంటల సాగుతోనే లాభసాటి వ్యవసాయం
- ఎల్లంపేట రైతుల సమిష్టి నిర్ణయం ఉభయ జిల్లాలకు ఆదర్శం
- లాభసాటి వ్యవసాయ విధానంపై సదస్సులో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్:
- కామారెడ్డికి త్వరలో కాళేశ్వరం జలాలు. మంచిప్ప ద్వారా ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలకు గోదావరి జలాలు. కేసీఆర్ ఆదేశాల మేరకు స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నా
- తెలంగాణ రాష్ట్రంలో అమలవుతోన్న పథకాలన్నీ ఉద్యమ కాలంలో కేసీఆర్ రూపొందించుకున్న ముందస్తు ప్రణాళికలో భాగమే. కరెంట్ సమస్యను రెండేళ్లలో తీర్చారు. కాళేశ్వరంతో సాగు నీళ్లు అందిస్తున్నారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతోంది
- కామారెడ్డిలో గతంలో కరెంట్ కోసం అత్యధికంగా రైతులే ధర్నాలు చేసేది. ఇప్పుడు ధర్నాల్లేవ్. రాస్తా రోకోల్లేవ్
- కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు, పంటల కొనుగోళ్లు చేయడం ఆషామాషి కాదు. 12వేల కోట్లతో 25వేల రుణం కలిగి ఉన్న రైతన్నలకు రుణమాఫీ చేయడం గొప్ప విషయం
- వ్యవసాయ విధానం ద్వారా రైతులకే మేలు. లాభసాటి సాగు ద్వారా ఆరుగాలం కష్టానికి ఫలితం దక్కుతుంది. కరెంట్, నీళ్లు, విత్తనాలు, ఎరువులు వచ్చినంక పంట దిగుబడులు పెరిగాయి
- భవిష్యత్తులో పంటలను ఆర్థిక పరిస్థితి బాగోలేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనలేకపోతే రైతుల పరిస్థితి ఏంటన్నది ఆలోచించాలి. అందుకే డిమాండ్ ఉన్న పంటలేస్తే సమస్యలే ఉండబోవు
- దేశంలో ఈ తరహా ప్రయోగం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుంది. భవిష్యత్తులో 3 నెలల ముందుగానే సాగుదారులకు వ్యవసాయ కార్డులు జారీ
- ఇప్పటి వరకు కేసీఆర్ ముట్టుకున్న ప్రతీ పని మంచిగనే అయ్యింది. ప్రతిపక్షాల పసలేని ఆరోపణలు. రైతును బాగు చేస్తుంటే ఓర్వలేక రాజకీయాలు
- తెలంగాణకు దెబ్బ తగిలినా చిన్న గీత పడినా విలవిల్లాడే వ్యక్తి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ కు ప్రాణం కంటే ఎక్కువ. పేదలు, రైతులను బాగు పర్చడం ద్వారా బంగారు తెలంగాణ సాధ్యమని భావించే వ్యక్తి మన ముఖ్యమంత్రి
- గిరిజనుల అటవీ భూముల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుంది" అని మంత్రి అన్నారు