వానాకాలం పంటలకు ప్రణాళికలు రెడీ: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి
- ఎరువులు,విత్తనాలు అందుబాటులోకి
- కంది పంటే లాభదాయకం
- సన్నాల పెంపుకు కసరత్తు
- రైతులను సంఘటిత పరచాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం
- అటువంటప్పుడే మద్దతు ధర సాధ్యం
- అన్ని ఉత్పత్తులపై తయారీ దారులే ధర నిర్ణయించేది
- ధాన్యానికి మాత్రం కొనుగోలు దారులు నిర్ణయించడం విడ్డూరం
- ఆ విధానం లో మార్పు కోసమే ఈ ప్రయత్నం
- రైతుబందు తగ్గింపు అన్నది శుష్క ప్రచారం
- నమోదు చేసుకున్న ప్రతి రైతుకు రైతుబందు
- నమోదు లో అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలి
- సమాజ అవసరాలకు తగ్గట్లుగా ఉత్పత్తులు ఉండాలి
- నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నియంత్రిత సాగుపై సమీక్షా
రైతులను సంఘటిత పరచాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని అటువంటప్పుడే పండించిన పంటకు ధర నిర్ణయించుకునే శక్తి రైతుకు లభిస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన నియంత్రిత సాగు అంతిమంగా రైతుకు లబ్ది చేకూర్చలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని ఆయన అన్నారు. రైతు బంధు తగ్గింపు అన్నది శుష్క ప్రచారం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. 2019 లో ఈ పధకం కింద 42,5355 మంది రైతులకు గాను 591.96 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఇప్పటికే 381769 మంది రైతుల ఖాతాల్లో 485.59 కోట్లు జమ అయ్యాయి అన్నారు. అయితే ఇకపై రైతు విదిగా వ్యవసాయ శాఖాదీకారి వద్ద తాను ఏ పంట వేస్తున్నాడు అన్నది నమోదు చేసుకోవాలి అని సూచించారు. నమోదు అయి కూడా రైతుబందు పథకం అందక పోతే అధికారులు బాధ్యత వహించాలిసి ఉంటుందన్నారు. వానాకాలం పంటలకు విత్తనాలు ఎరువులు సిద్దంగా ఉన్నాయన్నారు. జిల్లాలో సాగుకు అనువైన 10 లక్షల 67 వేల318 ఎకరాల్లో వెయ్యనున్న పంటలకు సరిపడ 91791 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులోకి తెచ్చామన్నారు.
కాకపోతే 2019 వానాకాలం లో జిల్లాలో లక్షా 55 వేల ఏకరాలకు పరిమితము చేసిన సన్నాలను ఈ వానాకాలం లో 2 లక్షల32 వేల 245 ఎకరాలలో సాగు చేసే విదంగా అధికారులకు మార్గదర్శనం చేసినట్లు ఆయన వెల్లడించారు. అదే విదంగా కంది పంట ను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం 2019 కి ప్రస్తుతానికి ఏకంగా 50%శాతానికి పెంచింది. అంటే కిందటి సంవత్సరం జిల్లాలో 14351 ఎకరాల కే పరిమితం అయిన కందిని 30 వేల ఎకరాలకు పెంచడం తో పాటు అందుకు సరిపడ 1200 క్వింటాళ్ల విత్తనాలను ఆయా ప్రాంతలకు చేర వేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,నోముల నర్సింహాయ్య యాదవ్ ,యన్.భాస్కర్ రావు,చిరుమర్తి లింగయ్య గాధారి కిశోర్ కుమార్ జిల్లా కలెక్టర్ సంగీత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.