కంటైన్మెంట్ జోన్లలో తగు చర్యలు తీసుకుంటున్నాం: తెలంగాణ సీఎస్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాల కనుగుణంగా రాష్ట్రంలో కోవిడ్ వైరస్ నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు, ముఖ్యంగా కంటైన్మెంట్ జోన్లలో తగు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేంద్ర క్యాబినేట్ కార్యదర్శికి వివరించారు. గురువారం క్యాబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబా కోవిడ్ -19 కు సంబంధించి ప్రజారోగ్య స్పందనపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో వైరస్ నియంత్రణలో ఉందని, రాష్ట్రానికి సరిపడ PPE Kits, N-95 Masks, Testing Kits, Beds, వెంటిలేటర్లు సమకూర్చుకున్నామని, ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేశామని, 1లక్ష కేసులకు చికిత్స అందించే విధంగా సిద్ధంగా ఉన్నామని కేంద్ర క్యాబినేట్ కార్యదర్శికి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి, CCLA Director రజత్ కుమార్ షైనీ తదితరులు పాల్గొన్నారు.