ఆండ్రాయిడ్ టీవీ, అమేజాన్ ప్రైమ్ లో టీ-సాట్ యాప్!

Related image

  • విద్యార్ధులకు, నిరుద్యోగ యువతకు మరింత చేరువౌతున్న టి-సాట్
  • టి-సాట్ కార్యాయలంలో హరిత హారం-సీఈవో శైలేష్ రెడ్డి
టి-సాట్ నెట్వర్క్ టెలివిజన్ ఛానళ్లు టి-సాట్ నిపుణ, విద్య ఇక నుండి ఆండ్రాయిడ్ టీవి, అమేజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు కేబుల్ నెట్వర్క్, యూట్యూబ్, యాప్, ఫెస్ బుక్, ట్విట్టర్  వెబ్ టీవీ రూపంలో అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ టెలివిజన్లు, అమేజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చాయి. కేబుల్ నెట్వర్క్, డి.టి.హెచ్ లతో సంబంధం లేకుండా ఉచితంగా టి-సాట్ ఛానళ్లును చూసే అవకాశం ఏర్పడింది.

జూబ్లిహిల్స్ లోని టి-సాట్ కార్యాలయంలో మొక్కలు నాటి హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించిన టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి

టి-సాట్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేస్తున్న సీఈవో శైలేష్ రెడ్డి, వి-హబ్ సీఈవో రావుల దీప్తి, ఇతర సిబ్బంది:


టి-సాట్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగుల తో పాటు తెలంగాణ ప్రజలందరికి ఉచితంగా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సీఈవో ఆర్. శైలేష్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఆండ్రాయిడ్ టీవీల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న దృష్ట్యా టి-సాట్ యాప్ ని ఆండ్రాయిడ్ టీవీ, ఆమేజాన్ ప్రైమ్ యాప్ లో అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆందులో భాగంగానే ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఆండ్రాయిడ్ టీవి, అమేజాన్ యాప్ లో టి-సాట్ యాప్ అందుబాటులోకి వస్తుందని శైలేష్ రెడ్డి అన్నారు. టీవీల్లో కేబుల్ కనెక్షన్, డీటీహెచ్ సౌకర్యం లేకున్నా ఈ యాప్ ద్వార టి-సాట్ నెట్వర్క్ ప్రసారాలు చూడవచ్చని చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా ప్రేక్షకులు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లను విశేషంగా ఆదరిస్తుండగా యూట్యూబ్ సబ్ స్ర్క్రైబ్స్ 3,16,000 లకు, యాప్ డౌన్ లోడ్స్ 1,40,000 లకు చేరుకున్నాయన్నారు.

ఆండ్రాయిడ్ టీవీ, అమేజాన్ ప్రైమ్ లో టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ఉచితంగా అందుబాటులోకి రావడం వల్ల విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఎంతగానో చేయూతగా ఉంటుందని, ప్రతి యేటా వినూత్న కార్యక్రమాలతో ప్రజల ముందుకు వస్తున్న టి-సాట్ నెట్వర్క్ ఈ యేడాది ఆండ్రాయిడ్ టీవీ, అమేజాన్ యాప్ ద్వార ప్రజల ముందుకు వచ్చిందని సీఈవో ప్రకటించారు.

ఘనంగా టి-సాట్ ద్వితీయ వార్షికోత్సవం:

టి-సాట్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.  టి-సాట్ ఆవిష్కృతమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ర్టానిక్స్ శాఖలో ఉన్న మనటీవి, తెలంగాణ ఏర్పాటు తరువాత ఐటిసి మరియు కమ్యూనికేషన్ శాఖలో టి-సాట్ గా ఆవిర్భవించింది. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో హరిత హారం కార్యక్రమం నిర్వహించారు. తొలుత టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి, వి-హబ్ సీఈవో రావుల దీప్తి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం టి-సాట్, వి-హబ్ సిబ్బంది కార్యాలయం ముందు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆవరణలో పలు రకాల పండ్లు, పూల మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపట్టారు. అనంతరం కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా వార్షికోత్సవ సంబరాలు జరుపుకున్నారు.

More Press Releases