ఈ-పాస్ ద్వారా పాఠశాలలకు సన్నబియ్యం సరఫరా: తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి
- అక్రమాలకు చెక్
- ఆగస్టు 1 నుండి 28,623 పాఠశాలలకు
- ప్రతి నెల 12 వేల మెట్రిక్ టన్నులు సరఫరా
- తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ఈ బియ్యం సరఫరాలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు ఈ-పాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చామని తెలిపారు. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాలకు, సంక్షేమ హాస్టళ్లకు ఈ-పాస్ విధానం ద్వారానే సరఫరా చేస్తున్నామని మంత్రి అన్నారు. ఈ విధానం ద్వారా ఏ రోజు, ఎంతమంది, ఎన్ని క్వింటాళ్ల బియ్యం తీసుకెళ్లారు, ఇంక ఎంత తీసుకెళాల్సి ఉంది, ఓపెనింగ్, క్లోజింగ్ బ్యాలెన్స్ వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. మొత్తం సరఫరా ప్రక్రియను పర్యవేక్షించడానికి కూడా సులువుగా ఉంటుంది. ఈ ప్రక్రియను హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తారు.