పాలకుర్తి మండలం తీగారంలో వినూత్నంగా మంత్రి ఎర్రబెల్లి పుట్టిన రోజు వేడుక
- ఖాళీ స్థలంలో విరివిగా మొక్కలు నాటి ఈడీఆర్ గార్డెన్ గా నామకరణం
- తీగారం గ్రామ పంచాయతీ, స్టూడెంట్ ఫర్ సేవ, మార్గం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం
అంతటితో ఆగక, ఆ స్థలానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన గుర్తుగా, ఈడిఆర్ గార్డెన్ గా నామకరణం చేశారు. ఆ గార్డెన్ రక్షణ, అందులోని మొక్కల సంరక్షణ బాధ్యతలను గ్రామ పంచాయతీ, స్టూడెంట్ ఫర్ సేవ, మార్గం ఫౌండేషన్ లు తీసుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పోగు రాజేశ్వరీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ మొగుళ్ళ కుమార్, ఎంపీటీసీ బెల్లి సోమయ్య, సాయి సందీప్ తేజ, పసునూరి రాజు, ప్రదీప్ తదితరులు ఆధ్వర్యం వహించారు. కాగా, మంత్రి దయాకర్ రావు పిలుపు మేరకు నిరాడంబరంగా, తెలంగాణకు హరిత హారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దొడ్డి కొమురయ్య వర్థంతి సందర్భంగా మంత్రి నివాళులు:
తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ యోధుడు దొడ్డి కొమురయ్య వర్థంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. నాడు దొడ్డి కొమురయ్య మొదటి అమరుడన్నారు. కొమురయ్య ప్రాణార్పణ తర్వాతే, రైతాంగ సాయుధ పోరాటం, పీడన నుంచి విముక్తి కాంక్ష ప్రజల్లో రగిలిందన్నారు. నాటి దొడ్డి కొమురయ్య, రైతాంగ ఆశయాలనే ప్రస్తుత సీఎం కెసిఆర్ కొనసాగిస్తున్నారని, రైతులను రాజులను చేయాలని తలపోస్తున్నారని అన్నారు. తెలంగాణలో చరిత్రలో లేని విధంగా రైతుల కోసం రైతు బంధు, రుణ మాఫీ, రైతు బీమా, పలు సబ్సీడీలు, కల్లాలు, కాలువల శుభ్రం, సాగునీరు, 24 గంటల విద్యుత్ సరఫరా, రైతు వేదికలు, పశువుల కొట్టాలు... ఇలా అనేక పథకాలతో రైతులను ఆదుకుంటున్నది సీఎం కెసిఆర్ ప్రభుత్వమేనని మంత్రి చెప్పారు.