ప్రత్యేక మొబైల్ యాప్ ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
రాష్ట్ర పురపాలక, పరిశ్రమల మరియు IT శాఖ మంత్రి KT రామారావు జన్మదినం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు, కళాకారులను మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (TITA) సహకారంతో రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ ను రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి K S శ్రీనివాస రాజుతో కలసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కళల ఖజానా గా అభివర్ణించారు. రాష్ట్రంలో ఎంతోమంది జానపద, గిరిజన, శాస్త్రీయ, లలిత కళాకారులున్నారు. వారందరికి సంభందించిన డేటా బేస్, ఆన్ లైన్ మరియు మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు, కళాకారులను మరింత చేరువ చేసేందుకు ఈ ప్రత్యేక మొబైల్ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి KCR కళాకారులకు పూర్వవైభవం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. అందులో భాగంగా కళాకారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలనే సంకల్పంతో మధ్యవర్తులకు తావు లేకుండా, మారుమూల ప్రాంతాలలో ఉన్న కళాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా " ఆన్ లైన్ " ద్వారా గుర్తింపు కార్డులను జారీ చేసే విధానం , కళాకారుల డేటా బేస్ ను రూపొందించి వారి జన్మస్థలం, కళారూపం, వయస్సు, చదువు, సాధించిన విజయాలు వంటి విషయాలు మరియు యాప్ ద్వారా ప్రజలకు, కళాకారుల సమాచారం కోసం ప్రత్యేకంగా T - CULTURE పేరుతో రూపొందించిన ఈ మొబైల్ యాప్ దేశంలోనే మొదటి ప్రయత్నం అని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కళాకారులకు సైతం సులభంగా ఉండేందుకు ఈ మొబైల్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అంతేగాక, కళాకారులకు ID కార్డ్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని MEE SEVA తో అనుసంధానం చేశామన్నారు. ID కార్డు కావాలనుకునే కళాకారులెవరైనా తమ వివరాలు, వారి కళా ప్రదర్శన వివరాలు, వారి గురించి పత్రికలలో వచ్చిన కథనాలను మీ సేవ సెంటర్ లలో సమర్పించి 30 రోజులలో తమ ID కార్డ్ ను పొందవచ్చు అని మంత్రి వెల్లడించారు. ఈ యాప్ సౌకర్యం ఆగస్టు 1 2020 నుండి అందుబాటులో ఉంటుందన్నారు. మొదటి కార్డు ను కవి, కళాకారుడు గా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకి అందించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
గౌరవ KTR జన్మదినం సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ ఒక విన్నూత్న మొబైల్ యాప్ ను రూపొందించినందుకు శాఖ కార్యదర్శి KS శ్రీనివాసరాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ లను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.