అర్హులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
ఖమ్మం నియోజకవర్గ పరిధిలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి మంజూరైన కల్యాణ లక్ష్మీ చెక్కులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఖమ్మం అర్బన్-15, రఘునాధపాలెం-9 మొత్తం 24 చెక్కులకు గాను రూ.24.02 లక్షల విలువ గల చెక్కులను సోమవారం ఖమ్మంలోని vdo's కాలనీ క్యాంప్ కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తున్నారని అన్ని వర్గాల ప్రజలకు పథకాలను ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. వృద్దులకు పెద్ద కొడుకుగా, ఆడ పిల్లలకు మేనమామగా, రైతులకు రైతు బాంధవుడుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా నిలిచారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, తెరాస జిల్లా పార్టీ కార్యాలయ ఇంచార్జ్ RJC కృష్ణ, RDO రవీంద్రనాథ్, తహశీల్దార్లు శ్రీనివాసరావు, నర్సింహరావు కార్పొరేటర్లు నాయకులు ఉన్నారు.
బాల రక్షా భవన్ ను ప్రారంభించిన మంత్రి:
ఖమ్మం నగరంలోని 23వ డివిజన్ బ్యాంక్ కాలనీలోని బాల రక్షా భవన్(Child Protection Unit)ను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అనంతరం ఆవరణలో మంత్రి పువ్వాడ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు ఉన్నారు.