డిసెంబర్ లో జరగనున్న 2వ విడత టెన్నీస్ ప్రీమియర్ లీగ్!
- 2 వ విడత టెన్నీస్ ప్రీమియర్ లీగ్‌కు ప్రముఖంగా విచ్చేయనున్న లియాండర్ పేస్ , సోనాలి బింద్రే
- రూ. 60 లక్షల నగదు బహుమానంతో , ఈ లీగ్‌లో దేశంలోని ప్రసిద్ధ స్త్రీ, పురుష క్రీడాకారులందరూ పాల్గొననున్నారు
ఒకవైపు టెన్నీస్ స్టార్ లియాండర్ పేస్ ముంబై ఫ్రాంఛైజీలో వాటా పొందబోతుండగా మరోవైపు బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే కూడా ఒక ఫ్రాంచైజీని సొంతం చేసుకోనున్నారు. టిపిఎల్‌లో ఉండే జట్లలో బాలికల అండర్-18, బాలుర అండర్ -14 మరియు వీల్‌చెయిర్ పార్టిసిపెంట్లతో పాటు స్త్రీ మరియు పురుష ప్లేయర్లు పోటీ పడతారు.
క్రొత్త ప్రతిభకు ఒక వేదికను అందించడానికి, అండర్ 18 బాలిక మరియు అండర్ 14 బాల క్రీడాకారులు నాలుగు నగరాలలో జరిగే టాలెంట్ హంట్ కార్యక్రమాల ద్వారా ఎంపికచేయబడతారు. ఈ టాలెంట్ డేస్ అహ్మదాబాద్ మరియు ముంబై నగరాలలో అక్టోబర్ 20 మరియు 23 తేదీలలో మరియు హైదరాబాద్ మరియు ఢిల్లీలలో నవంబర్ 3 మరియు 10 తేదీలలో జరుగుతాయి. టాలెంట్ డేస్ కు రిజిస్ట్రేషన్ ఆగస్ట్ 5 నుండి ప్రారంభమై అక్టోబర్ 5 న ముగియనుంది.
ఈ లీగ్ మాజీ జాతీయ క్రీడాకారుడు కునాల్ ఠాకూర్ మరియు నటుడు/వ్యాపారస్తుడు అయిన మ్రుణాల్ జైన్‌లచే వ్యవస్థాపించబడి ఐశ్వర్యరాయ్ బచన్ మరియు లియాండర్ పేస్‌ల వంటి ప్రముఖ బాలీవుడ్ నటీనటులు మరియు క్రీడాకారుల మద్దతు సహకారాలతో తన మొదటి విడతలో భారీ విజయాన్ని సాధించింది. టెన్నీస్ స్టార్ లియాండర్ పేస్ ముంబై ఫ్రాంఛైజీలో వాటా పొందబోతుండగా మరోవైపు బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే కూడా ఒక ఫ్రాంచైజీని సొంతం చేసుకోనున్నారు. గొప్ప క్రీడాకారులనే కాకుండా, ఇందులో యువ అండర్ -14 క్రీడాకారులు పోటీపడటాన్ని కూడా చూడాలని, ఈ లీగ్‌తో అనుబంధం కలిగి ఉన్న వీల్‌చెయిర్ పార్టిసిపెంట్లకు కూడా చేయూతనివ్వాలని సోనాలి ఆశిస్తుంది.
రూ. 60 లక్షల నగదు బహుమానంతో, ఈ లీగ్‌లో దేశంలోని ప్రసిద్ధ స్త్రీ, పురుష క్రీడాకారులందరూ పోటీ పడటాన్ని చూడవచ్చు. ఈ టోర్నమెంట్లో పురుషుల విభాగంలో అర్జున్ ఖాదే ప్రధమ స్థానంలో ఉండగా మహిళల విభాగంలో అంకిత రైనా ప్రధమ స్థానంలో ఉంది. ఈ టోర్నమెంట్లో ఇంకా అనేకమందిని చేర్చుకును మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దేందుకు, దీని నిర్వాహకులు యు014 బాలురు, యు-18 బాలికలు మరియు వీల్ చైర్ విభాగాలను కూడా కలిగి ఉన్నారు.
ఈ లీగ్ ఆల్ ఇండియా టెన్నీస్ అసోసియేషన్ (ఎఐటిఎ) తో అనుబంధమై ఉండి మహారాష్ట్ర స్టేట్ లాన్ టెన్నీస్ అసోసియేషన్ (ఎంఎస్‌ఎల్‌టిఎ) లోని ప్రముఖులచే నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమం గురించి ప్రశ్నించినప్పుడు లియాండర్ పేస్ మాట్లాడుతూ “ మెంటర్ల మార్గదర్శకత్వం మరియు సహకారంతో యువత వారి ప్రతిభను ప్రదర్శించడానికి భారత టెన్నీస్‌కు ఈ ప్రోత్సాహం అవసరం. ఈ 2 వ సంవత్సరం టిపిఎల్‌తో అనుబంధంగా పనిచేయడాన్ని నేనెంతో ఆస్వాదిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ లీగ్ టెన్నీస్‌కు ఒక స్థిరమైన వేదికను ఏర్పాటుచేసి మన దేశంలో ఈ క్రీడను మరింత ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాను.” అని అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీ కునాల్ ఠాకూర్. “ మొదటి విడత లీగ్‌లో వచ్చిన స్పందన అమోఘం, మాకు బాలీవుడ్ మరియు క్రీడా ప్రపంచాల నుండి అద్భుతమైన ప్రోత్సాహం లభించింది. భారతదేశంలోని ప్రతి గృహానికి చేరుకుని క్రికెట్‌లా టెన్నీస్‌ను కూడా అధిక ప్రజాదరణ కల క్రీడగా మలచాలన్నదే మా లక్ష్యం. క్రికెట్ క్రీడాకారులు ఐపిఎల్ ద్వారా ఎలాంటి వేదికను పొందుతున్నారో సరిగ్గా అటువంటి వేదికనే టెన్నీస్ క్రీడాకారులకు కూడా అందించాలని మేము కోరుకుంటున్నాము.” అని అన్నారు.