వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో 'ఈ - కార్యాలయం' అమలు
హైదరాబాద్: కోవిడ్-19 దృష్ట్యా, ఉద్యోగుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచనలను పాటించడంలో భాగంగా వ్యవసాయ కమిషనర్ బి. జనార్దన్ రెడ్డి, వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో ఈ - కార్యాలయాన్ని అమలుపరిచారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ-ఆఫీస్ సామర్థ్యం ద్వారా, ప్రభుత్వ ప్రతిస్పందనల యొక్క స్థిరత్వం మరియు ప్రభావం మెరుగుపడుతుందని తెలియజేశారు. పరిపాలన నాణ్యతను మెరుగుపరచడానికి, సమర్థవంతమైన వనరుల నిర్వహణకు, పారదర్శకత మరియు జవాబుదారీతనం ఏర్పాటుకు ఈ-ఆఫీస్ సరైన వేదిక అని తెలిపారు.
అదే విధంగా, సమయం తగ్గించడానికి మరియు పౌరుల చార్టర్ యొక్క డిమాండ్లను తీర్చడానికి ఈ-ఆఫీస్ సరైన అవకాశంగా అభివర్ణించారు. ఇందులో భాగంగానే, సిబ్బందిని ఆగస్టు నెలను ఈ-ఆఫీస్ నెలగా జరుపుకోవాలని వ్యవసాయ కమిషనర్ పిలుపునిచ్చారు.