సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను సందర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి
సోమవారం రోజున తెలంగాణ వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు జీడిమెట్లలోని ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (COE)ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు హైటెక్ పద్ధతిలో, నియంత్రిత వాతావరణ పద్ధతిలో ఒక ఎకరం విస్తీర్ణంలో పెంచుతున్న కూరగాయల నారును పరిశీలించారు. ఇక్కడ ఆధునిక పద్ధతుల ద్వారా లో చీడ పీడలు లేకుండా మొక్క కాండం దృడంగా ఉండి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడం వలన మామూలు పద్ధతిలో పెంచే నారు కంటే 30 నుండి 40 శాతం అదనంగా దిగుబడి వస్తుందని పేర్కొన్నారు
ఇక్కడ పెంచే నారును సబ్సిడీలో భాగంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోడపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీ నాగులపల్లి దేవేందర్ కు 90 శాతం రాయితీతో మిర్చి నారును అందించి ఎలా సాగుచేయాలో సూచించారు. సబ్సిడీపై నారు కావలసిన రైతులు ఒక మొక్కను 10 పైసలు చొప్పున చెల్లించి ముందుగా కావలసిన రకం మరియు నారును బుక్ చేసుకోవాలని సూచించారు. ఆధునిక సాగులో కూరగాయల నారు సత్ఫలితాలు ఇస్తుందని ఇదే పద్ధతిని అన్ని జిల్లాలకు విస్తరించాలని సూచించారు.
తెలంగాణా లో మొట్టమొదటి సారిగా COE పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్న ఆర్కిడ్ పూల పంటను 3000 చదరపు మీటర్లు అందులోని రకాలు, యాజమాన్య పద్ధతులు దిగుబడి, లాభాలను గూర్చి వివరంగా తెలుసుకున్నారు. అలాగే COE లో సాగుచేస్తున్న గులాబీ కట్ ఫ్లవర్స్ మరియు జర్బేరా సాగు, యాజమాన్య పద్ధతులను తెలుసుకున్నారు. COE లో ఏర్పాటుచేసిన టన్నెల్స్‌లో కీరాదోసా, క్యాప్సికం, చెర్రీ, టమాటా మరియు ఆకుకూరలు పంటలను, అందులోని రకాలను, యాజమాన్య పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. నిట్టనిలువు పద్దతిలో కూరగాయలు, ఆకు కూరలు సాగుచేసే పద్ధతిని, రావడం విషయాలను పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. దేశంలో వినూత్న పద్ధతిలో నిట్టనిలువు పద్దతిలో ఆకుకూరలు తక్కువ విస్తీర్ణంలో ఈకువ దిగుబడి వచ్చేవిధంగా 560 చ.మీ లలో ప్రయోగాత్మకంగా నిట్టనిలువు సేద్యంలో COE లో ఏర్పాటు చేయడం జరిగింది. COEలో కోరమాండల్ ఇంటర్నేషనల్ మరియు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న న్యూట్రి క్లినిక్ ద్వారా భూసార పరీక్షలు చేస్తున్న ల్యాబ్ ను సందర్శించి న్యూట్రి క్లినిక్ సేవలను కేవలం రూ. 100 రూపాయలకే ఒక్కో శాంపిల్ ను పరీక్షించి ఇచ్చే విధానాన్ని అభినందించారు COEలో గల సోలార్, పోరాటబుల్, కోల్డ్ స్టోరేజీలను పరిశీలించారు సబ్సిడీపై భూసార పరీక్షలు చేసుకోవాలని సూచించారు గల సోలార్ పరిశీలించారు. సోలార్ కోల్డ్ స్టోరేజ్ మరియు నిల్వ సామర్థ్యం మరియు నిల్వచేసే పంటలను అడిగి తెలుసుకున్నారు. COE లో గల నీటిపారుదల మరియు ఎరువులు ఇచ్చే విధానంలో గల ఆటోమేషన్ మరియు సెన్సార్ విధానంలో వాతావరణ పద్ధతులను ఎలా నియంత్రించగలమో అడిగి తెలుసుకున్నారు. COEలో పట్టణ ప్రాంత వాసులకు శిక్షణా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన టెర్రస్ ఫామింగ్, రూఫ్ గార్డెనింగ్ విధానంలో మిద్దె తోటలను పరిశీలించారు.