వచ్చేనెల 4న దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభం: మంత్రి వెలంపల్లి
విజయవాడ: ఐదు సంవత్పరాలుగా నగరాన్ని అభివృద్ది చేయకుండా విజయవాడ ప్రజలను మోసం చేసింది చంద్రబాబు నాయుడు అని, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నగర అభివృద్దికి బాటలు పడ్డాయని ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
శుక్రవారం నియోజకవర్గంలో స్వాతి సెంటర్ వద్ద క్యాంబే రోడ్డు మరియు గాంధీ బొమ్మ సెంటర్‌లో దాదాపు 4కోట్లు రూపాయలతో అభివృద్ది పనులకు మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు శుంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు జలీల్ ఖాన్, బొండా ఉమా, గద్దె రామ్మెహనరావు, ఎంపీ కేశినేని నాని విజయవాడకు ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేని దద్దమ్మలని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయంలో నగర అభివృద్ది పట్టించుకోని ఎంపీ ఇప్పడు దుర్గగుడి ఫ్లైఓవర్ గురించి మాట్లాడటం హస్యస్పదంగా ఉందన్నారు. కృష్ణా పుష్కరాలకు దుర్గగుడి ఫ్లైఓవర్ పూర్తి చేస్తామని చెప్పిన ఎంపీ కేశినేని నాని ఇప్పడు ప్రజలకు ఏమి సమాధానం చేబుతారని ప్రశ్నించారు.
వచ్చేనెల 4న దుర్గగుడి పైవోర్‌తో పాటు బెంజిసర్కిల్ ఫ్లైఓవర్, విజయవాడ అవుటర్ రింగ్ రోడ్డును కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభిస్తామన్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత సంక్షేమం, అభివృద్దిని రెండు కళ్లుగా నగర అభివృద్దికి నిధులు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, నగర పాలక సంస్థ సిబ్బంది ఉన్నారు.